Ajinkya Rahane: ర‌హానే చేతి వేలికి గాయం.. ఆందోళ‌న‌లో అభిమానులు.. రెండో ఇన్నింగ్స్ ఆడ‌డంపై

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌(WTC Final )లో టీమ్ఇండియా టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే(Ajinkya Rahane) 89 ప‌రుగుల‌తో మాత్రం కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు.

Ajinkya Rahane

Rahane: ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌(WTC Final )లో టీమ్ఇండియా టాప్ ఆర్డ‌ర్ విఫ‌లం అయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ ఆట‌గాడు అజింక్య ర‌హానే(Ajinkya Rahane) మాత్రం 89 ప‌రుగుల‌తో  కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. శార్దూల్ ఠాకూర్‌(51), ర‌వీంద్ర జ‌డేజా(48)ల‌తో భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పి భార‌త్‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం చేశాడు. చేతి వేలికి అయిన గాయం ఓ వైపు వేధిస్తున్న‌ప్ప‌టికీ పోరాట‌ప‌టిమ చూపాడు. దీంతో ప్ర‌స్తుతం ర‌హానే పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

WTC Final 2023: ప‌టిష్ట స్థితిలో ఆస్ట్రేలియా.. ఆధిక్యం 296 ప‌రుగులు.. టీమ్ఇండియాకు క‌ష్ట‌మే..!

ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా జ‌ట్టు టీమ్ఇండియా ముందు క‌నీసం 400 ప‌రుగుల ల‌క్ష్యానైనా ఉంచే అవ‌కాశం ఉంద‌ని క్రికెట్ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 123/4తో ఉంది.నాలుగో రోజు సాధ్య‌మైన‌న్ని ఎక్కువ ప‌రుగులు చేసి టీమ్ఇండియా ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచాల‌ని ఆసీస్ బావిస్తోంది. టీమ్ఇండియా బౌల‌ర్లు ఏదైనా అద్భుతం చేస్తే ప‌రిస్థితి మారే అవ‌కాశం ఉంది. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ టీమ్ఇండియా మ‌రోసారి బ్యాటింగ్ చేసే అవ‌కాశం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో సైతం ర‌హానే రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అదే స‌మ‌యంలో అత‌డి చేతి వేలికి అయిన గాయం అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

త‌న చేతి వేలికి అయిన గాయంపై అజింక్య ర‌హానే స్పందించాడు. త‌న చేతి వేలికి అయిన గాయం తీవ్ర‌మైన‌ది కాద‌ని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో గాయం బ్యాటింగ్ పై ప్ర‌భావం చూప‌ద‌ని ఆశిస్తున్న‌ట్లు అత‌డు చెప్పాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో త‌న ఆట తీరు ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశాడు. “మేము 320 నుంచి 330 ప‌రుగులు చేస్తామ‌ని బావించాం. అయితే అలా జ‌ర‌గ‌లేదు. గ్రీన్ అద్భుత‌మైన క్యాచ్ ప‌ట్ట‌డంతో నేను పెవిలియ‌న్‌కు చేర‌క త‌ప్ప‌లేదు. ఆసీస్ ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్కొ సెష‌న్‌ను ఆడుతూ ముందు సాగుతాం.” అని ర‌హానే అన్నాడు.

Ajinkya Rahane: అజింక్య ర‌హానే అరుదైన ఘ‌న‌త‌.. ప్ర‌స్తుతం క్రికెట్ ఆడేవారిలో కోహ్లి ఒక్క‌డే

ట్రెండింగ్ వార్తలు