Virat Kohli : దినేశ్ కార్తీక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. గ్ర‌హాంత‌ర వాసుల పై కోహ్లీకి ఆస‌క్తి..

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Dinesh Karthik Reveals Which India Star Believes In Aliens

Virat Kohli – Dinesh Karthik : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ బ్యాట‌ర్ల‌లో అత‌డు ఒక‌డు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 ఫైన‌ల్ మ్యాచ్‌లో 76 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. టీమ్ఇండియా విశ్వ‌విజేత‌గా నిలిచిన త‌రువాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇక అభిమానులు అంతా కోహ్లీని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటూ ఉంటారు.

కాగా.. విరాట్ కోహ్లీ గురించి టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు దినేష్ కార్తీక్ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని చెప్పాడు. ఏలియ‌న్స్ పై కోహ్లీకి ఎంతో ఆస‌క్తి ఉంద‌ని క్రిక్‌బ‌జ్‌తో మాట్లాడుతూ చెప్పాడు. నిజం చెప్పాలంటే గ్ర‌హాంత‌ర వాసులంటే నాకు పెద్దగా న‌మ్మ‌కం లేదు. అంతేకాదు.. ఈ విష‌యం పై నాకు పెద్ద‌గా ఏమీ తెలియ‌దని కార్తీక్ అన్నాడు. ఇక ఏలియ‌న్స్ అంటే ఎవ‌రికి ఆస‌క్తి ఉంటుందో, దాని గురించి చాలా విష‌యాలు తెలిసిన వ్య‌క్తి ఎవ‌రో చెబితే ఆశ్చ‌ర్య‌పోవ‌డం మీవంతు అని అన్నాడు.

Team India : భార‌త జ‌ట్టు అసిస్టెంట్ కోచ్‌లు వీరేనా..? బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..!

ఈ విష‌యంలో విరాట్ కోహ్లీకి ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంటుందని, అమెరికాలోనో లేదా నెవాడాలోని ఏదో ఓ ప్రాంతంలో క‌నిపించిన గ్ర‌హాంత‌ర వాసుల గురించి అత‌డు నాకు ఓ వీడియో చూపించాడని కార్తీక్ చెప్పుకొచ్చాడు. నాకు ఆప్రాంతం పేరు స‌రిగ్గా గుర్తుకులేదన్నాడు. గ్ర‌హాంత‌ర వాసుల గురించి కోహ్లీకి ఎంతో ఆస‌క్తి ఉంటుంద‌ని తెలుసున‌ని కార్తీక్ తెలిపాడు.

ఐపీఎల్ 2024 సీజ‌న్ ముగిసిన త‌రువాత కార్తీక్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికాడు. అన్ని ర‌కాల ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. కాగా.. ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ బ్యాటింగ్ కోచ్‌గా, మెంటార్‌గా కార్తీక్ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

Suryakumar Yadav : టీ20 కెప్టెన్ అయిన త‌రువాత‌ సూర్యకుమార్‌ తొలి స్పంద‌న‌..

ట్రెండింగ్ వార్తలు