Suryakumar Yadav admission in first reaction on becoming India T20I captain
Suryakumar Yadav : భారత టీ20 క్రికెట్‌లో సూర్యకుమార్ యాదవ్ శకం మొదలైంది. పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించడంతో సూర్యకుమార్‌ను టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా నియమించారు. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనతో సూర్య జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. గతంతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గైర్హజరీలో సూర్య తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టగా ఇప్పుడు పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా విధులు నిర్వర్తించనున్నాడు.
రోహిత్ శర్మ తరువాత హార్దిక్ పాండ్యానే టీమ్ఇండియా కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. అయితే.. కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ రావడం, హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతుండడం సూర్యకు కలిసి వచ్చింది. చాలా ఆలస్యంగా 30 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకుమార్ అడుగుపెట్టాడు. అయితే.. మూడేళ్ల కాలంలోనే భారత జట్టుకు సారథిగా ఎంపిక కావడం గమనార్హం.
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో యాంటీ సెక్స్ బెడ్స్.. పాపం అంటున్న నెటిజన్లు..
టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత సూర్యకుమార్ తొలిసారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. గత కొన్ని వారాలు కలలా అనిపిస్తున్నాయని అన్నాడు. ఇదంతా దేవడి కృప అని చెప్పాడు. తనపై ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప అనుభూతి అని, ఇక సారథి అయితే మరెంతో బాధ్యతగా ఉండాలన్నాడు. ఇకపై కూడా అభిమానుల మద్దతు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పాడు.
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను బౌండరీ లైన్ వద్ద సూర్య అద్భుతంగా అందుకున్నాడు. ఈ కీలక క్యాచ్‌తో టీమ్ఇండియా విజయం సాధించింది. 17 ఏళ్ల తరువాత భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
IND vs PAK : పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో మ్యాచ్ ఓడిపోవడానికి కారణం..