Realme intelligence Feature : రియల్‌మి ఫోన్లలో ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్ డిసేబుల్.. యూజర్ల డేటా ఇక సేఫ్.. కొత్త అప్‌డేట్ ఇదిగో..!

Realme intelligence Feature : రియల్‌మి ఫోన్లలో ఇంటెలిజెంట్ సర్వీసెస్ అనే ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయిందని కంపెనీ గుర్తించింది. రియల్‌మి ఫీచర్ యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

Realme disables intelligence feature that was accused of stealing user data with new update

Realme intelligence Feature : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ రియల్‌మి (Realme) ఫోన్లలో ఒక డిఫాల్ట్ ఫీచర్ ద్వారా యూజర్ల డేటాను సేకరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే రియల్‌మి కంపెనీ తమ ఫోన్లలో ఇంటెలిజెంట్ సర్వీసెస్ అనే డిఫాల్ట్ ఫీచర్ డిసేబుల్ చేసింది. ప్రధానంగా రియల్‌మి 11 ప్రో సిరీస్ కోసం కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ అప్‌డేట్ ద్వారా డిఫాల్ట్‌గా Realme UI 4.0లో అడ్వాన్సడ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్ నిలిపివేస్తుంది.

ఈ ఫీచర్ కారణంగా డివైజ్ డేటా, యాప్ వినియోగం సమాచారం, లొకేషన్ డేటా, క్యాలెండర్ ఈవెంట్‌లు, అన్ రీడ్ SMS మెసేజ్, మిస్డ్ కాల్‌ల గురించి గణాంకాలు వంటి క్లిష్టమైన డేటాను సేకరించడానికి రియల్‌మి యాక్సెస్‌ను ఇంటెలిజెంట్ సర్వీస్ ఫీచర్ ఇస్తుందని వినియోగదారులు గుర్తించారు. వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఎనేబుల్ చేయడం ఈ ఫీచర్ వివాదానికి కేంద్రంగా మారింది. యూజర్ల SMS, ఫోన్ కాల్‌లు, షెడ్యూల్‌లపై కంపెనీ ఎలాంటి డేటాను యాక్సస్ చేయదని రియల్‌మి స్పష్టం చేసింది. కొత్త Realme UI 4.0 అప్‌డేట్ ద్వారా ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్ డిసేబుల్ చేస్తుందని తెలిపింది.

రియల్‌మి 11 ప్రో, రియల్‌మి 11 Pro ప్లస్ అప్‌డేట్‌తో వరుసగా RMX3771_13.1.0.524 (EX01), RMX3741_13.1.0.524 (EX01) ఫర్మ్‌వేర్ వెర్షన్‌లను అందుకుంటున్నాయి. వినియోగదారులు Settings > Software Update లేదా System Update వెళ్లడం ద్వారా కూడా లభ్యతను చెక్ చేయవచ్చు. ఎన్‌హాన్స్‌డ్ ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఆప్షన్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేయబడిందో లేదో చెక్ చేయడానికి, Settings > Advanced Settings > System Services > Enhanced Intelligent Services ఆప్షన్ ఎంచుకోండి.

Realme disables intelligence feature that was accused of stealing user data with new update

Read Also : Realme 11 Pro Plus 5G Sale : ఫస్ట్ డే సేల్‌లోనే 60వేల యూనిట్లకుపైగా అమ్ముడైన రియల్‌మి 11 ప్రో ప్లస్ 5G ఫోన్..

రియల్‌మి యూజర్లు ఈ ఫోన్‌ను లేటెస్ట్ Realme UI 4కి (Android 13 ఆధారంగా) అప్‌డేట్ చేసిన తర్వాత ఆప్షన్లు నిలిచిపోయాయి. ఎన్‌హాన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ అనేది డివైజ్ ఫంక్షన్‌లకు సపోర్టు చేసే ఇంటర్నల్ సర్వీసు. మీరు మీ డివైజ్ ఉపయోగించే విధానం ఆధారంగా మీ యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. ఆప్టిమైజ్ చేసిన ఛార్జింగ్ ఫీచర్‌ను అందించడానికి ‘ఎహాన్స్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ మీ లొకేషన్ డేటాను మీ వినియోగ గణాంకాలను స్థానికంగా ప్రాసెస్ చేయాలి. మీ డివైజ్‌లో అలాగే లోకేషన్ అనుమతిని పొందాలి.

అప్‌డేట్ చేంజ్‌లాగ్ అప్‌డేట్ ద్వారా ఇంటెలిజెంట్ సర్వీసెస్ డిఫాల్ట్‌గా ‘సెట్ ఆఫ్’ అయిందని స్పష్టం చేస్తుంది. వినియోగదారులు ఈ ఫీచర్ ఎనేబుల్ చేయాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్ కెమెరా క్వాలిటీ, సిస్టమ్ స్టేబిలిటీ, విద్యుత్ వినియోగాన్ని కూడా ఆప్టిమైజ్ చేస్తుంది. ఇతర రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌లు తమ డివైజ్‌లో లేటెస్ట్ Realme UI 4 అప్‌డేట్ వచ్చిన తర్వాత అదే పద్ధతిని అనుసరిస్తాయి. రియల్‌మి ఫోన్లలో డిఫాల్ట్‌గా ఫీచర్‌ని డిసేబుల్ చేయాలనే కంపెనీ నిర్ణయం కూడా ప్రభుత్వ జోక్యం వల్ల కావచ్చు. వినియోగదారులు ట్విట్టర్‌ వేదికగా ఫిర్యాదు చేసిన తర్వాత, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెంటనే చెక్ చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రికి సూచించారు.

యూజర్ల వ్యక్తిగత డేటాను స్టోర్ చేయడంపై వచ్చిన ఆరోపణలపై రియల్‌మి స్పందించింది. మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసెస్ కింద ప్రాసెస్ చేసిన డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుందని, యూజర్ డివైజ్‌లో ఎన్‌క్రిప్టెడ్ హార్డ్‌వేర్‌లో స్టోర్ అవుతుంది. డేటా మరెక్కడా షేర్ చేయబడదని లేదా క్లౌడ్‌కు అప్‌లోడ్ చేయబడదని కంపెనీ స్పష్టం చేసింది. యూజర్ల ప్రైవసీ ప్రొటెక్షన్ కోసమే కంపెనీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. యూజర్లఅవసరాల ఆధారంగా మెరుగైన ఇంటెలిజెంట్ సర్వీసు ఫీచర్‌ను మాన్యువల్‌గా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చుని కంపెనీ తెలిపింది.

Read Also : Realme Narzo 60 Series : భారత్‌కు రియల్‌మి నార్జో 60 సిరీస్ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ఈ నెలాఖరులోనే లాంచ్..!

ట్రెండింగ్ వార్తలు