Harish Rao Thanneeru : చంద్రబాబు అసలైన వారసుడు రేవంత్ రెడ్డి, ప్రజలు కళ్లకు అద్దుకుని మరీ ఆయనను గెలిపిస్తారు- మంత్రి హరీశ్ రావు

Harish Rao Thanneeru : కాంగ్రెస్ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్ చేసిన ద్రోహం కేసీఆర్ సరి చేస్తున్నారు. కేసీఆర్ ఓ రుషిలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు.

Harish Rao Thanneeru(Photo : Google)

Harish Rao Thanneeru – Revanth Reddy : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు వారసుడిగా అభివర్ణించారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అసలైన వారసుడిగా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు. మండలి సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసుకోవాలని సూచించారు. ఉచిత కరెంట్.. ఉత్త కరెంట్ అని చెప్పింది నిజం కాదా? అని రేవంత్ ను ప్రశ్నించారు.

” టీడీపీలో ఉన్నపుడు కాంగ్రెస్ ఉత్తదే అన్నావు. ఇప్పుడు అంతా కాంగ్రెస్ అంటున్నావు. కాంగ్రెస్ పాలనలో నిరంతర కరెంట్ కోసం ధర్నాలు చేయలేదా? ఈ తొమ్మిదేళ్లల్లో కరెంట్ గురించి విపక్షాలు ఎందుకు మాట్లాడలేదు? కరెంట్ కోసం రైతులు ఇప్పుడు ఆలోచించే పరిస్థితి లేదు. విద్యుత్ పై గ్రామాల్లో భారీగా చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పవర్ ఎలా ఉందో అందరికీ తెలుసు.

Also Read..BRS: మామిడి తోటలో ఓ వర్గం భేటీ.. తోట బయట మరో వర్గం నిలబడి..

కాంగ్రెస్ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్ చేసిన ద్రోహం కేసీఆర్ సరి చేస్తున్నారు. కేసీఆర్ ఓ రుషిలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు రాక్షసులుగా అడ్డుకుంటున్నారు. తెలంగాణ ఖ్యాతిని దెబ్బతీసే యత్నం చేస్తున్నారు. దేశంలోని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. కేసీఆర్ కు ఎక్కడా పోటీ ఉండదు. కేసీఆర్ మా దగ్గర పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

కేసీఆర్ సీఎం కాక ముందు తెలంగాణ ఎలా ఉంది? నేడు ఎలా ఉంది? మీరే ఆలోచించండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనుకోవడం దింపుడు కల్లం ఆశలే. జహీరాబాద్ లో రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలు వస్తున్నాయి” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Also Read..KTR: ప్రభుత్వ బడిలో వసతులలేమిపై తన కొడుకు హిమాన్షు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందన

”ఎకరానికి 3 గంటలు కరెంటు చాలని రేవంత్ అంటున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకి రేవంత్‌ రెడ్డి అసలైన వారసుడిగా మారారు. రేవంత్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఉత్త కరెంటు అనలేదా? కాంగ్రెస్‌ పాలనలో కరెంటు బాగుందా? బీఆర్ఎస్ పాలనలో బాగుందా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. కేసీఆర్‌ పాలనలో అద్భుతమైన పంటలు పండుతున్నాయి. రైతులకు 3 గంటలు కరెంటు కావాలో.. 24గంటలు కావాలో తెలియదా? కరెంటుపై ఎంత చర్చ జరిగితే బీఆర్ఎస్ కు అంత లాభం” అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు