RRR : ‘ఆర్ఆర్ఆర్’కి వ్యాక్సిన్‌కి లింక్ పెట్టిన ఆర్జీవీ.. ప్రభుత్వం ఆర్జీవీ చెప్పింది చేయాలి అంటున్న నెటిజన్లు

ఇప్పుడు దీనికి 'ఆర్ఆర్ఆర్' సినిమాకి లింక్ పెడ్తూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్జీవీ తనదైన శైలిలో మంచి సలహానే ఇచ్చాడు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా....

RRR :   ఆర్జీవీ సినిమాలు ఎంత సెన్సేషన్ సృష్టిస్తాయో ఆయన ట్వీట్స్ కూడా అంతే సెన్సేషన్ ని సృష్టిస్తాయి. చాలా మంది ఆర్జీవిని వ్యతిరేకించినా అతను చెప్పేది కరక్టే కదా అని అప్పుడప్పుడు ఆలోచిస్తారు. అలా ఆలోచించేలా ఆర్జీవీ ట్వీట్లు ఉంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకి ఆర్జీవీ దగ్గరే సమాధానాలు ఉంటాయేమో. ప్రపంచంలోని అన్ని విషయాలపై ఆర్జీవీ ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఆర్జీవీ చేసిన ఓ ట్వీట్ ఒకపక్క వైరల్ అవుతూనే మరోపక్క ఆలోచింపచేస్తుంది.

తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మళ్ళీ లాక్ డౌన్ తప్పదేమో అంటున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని సెట్ అవుతున్నాయి. ఇన్ని రోజులుగా కష్టాలు పడ్డ సినీ పరిశ్రమ గత కొన్ని రోజులుగానే వరుస సినిమాలు రిలీజ్ చేసి మంచి విజయాల్ని సొంతం చేసుకుంటూ ముందుకి వెళ్తుంది. తాజాగా ఈ ఒమిక్రాన్ తో మరోసారి సినిమాలు వాయిదా పడటం తప్పదేమో, మళ్ళీ సినీ పరిశ్రమకి కష్టాలు తప్పవేమో అనే భయం పట్టుకుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూని విషించారు. థియేటర్స్ లో 50 శాతానికి సీట్స్ ని తగ్గించారు. ఒమిక్రాన్ ని కొంతవరకు ఐనా తగ్గించాలి అంటే రెండు డోసుల వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాలి అని చెప్తున్నారు.

Pushpa : ఆ సీన్‌లో బన్నీని, ఫాహిద్ ఫాజిల్‌ని నగ్నంగా చూపిద్దాం అనుకున్నా : సుకుమార్

ఒకపక్క రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ రెండు డోసులని వేసుకోవాలని చెప్తుంది. అయినా కొంతమంది వేసుకోవట్లేదు. ఇప్పుడు దీనికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి లింక్ పెడ్తూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్జీవీ తనదైన శైలిలో మంచి సలహానే ఇచ్చాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ చూపిస్తేనే థియేటర్లోకి అనుమతించాలని, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇలా చేస్తే ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని సినిమాకు వస్తారని అన్నాడు. థియేటర్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూడాలనే కోరిక వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని ఓడిస్తుంది అని ఆర్జీవీ తన ట్వీట్ తో తెలిపాడు.

Krithi Shetty : లిప్‌లాక్, బోల్డ్ సీన్స్ అన్నీ మామూలు సీన్స్ లాంటివే : కృతిశెట్టి

దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఇది కూడా నిజమే కదా, ఇలా చేస్తే అందరూ వ్యాక్సిన్ వేసుకుంటారు కదా అని నెటిజన్లు ఈ పోస్ట్ ని షేర్ చేసి కామెంట్లు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు