India vs Kuwait Final: శాఫ్ టైటిల్ భారత్‌దే.. హోరాహోరీ పోరులో కువైట్‌పై విజయం

ఉత్కంఠభరితంగా సాగిన పోరులో కువైట్‌పై భారత్ ఫుట్‌బాల్ జట్టు ఘన విజయం సాధించింది. దీంతో శాఫ్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను తొమ్మిదో సారి కైవసం చేసుకుంది.

SAFF Championship 2023: భారత ఫుట్‌బాల్ జట్టు (Indian Football Team) మరోసారి శాఫ్ ఫుట్‌బాల్ టైటిల్‌ (Saff football title) ను నిలబెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఘాటౌట్లో ఛెత్రి సేన 5-4తో కువైట్‌పై విజయం సాధించింది. దీంతో భారత్ జట్టు 9వ సారి శాఫ్ ఛాంపియన్ షిప్ టైటిల్ ( SAFF Championship title) ను కైవసం చేసుకుంది. నిర్ణీత సమయం ముగిసే సమయానికి భారత్, కువైట్ జట్లు ఒక్కో గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయింది. ఫలితంగా నిర్ణయాత్మక ఫెనాల్టీ ఘాటౌట్‌కు మ్యాచ్ దారితీసింది. మ్యాచ్ చివరల్లో అద్భుతంగా రాణించిన భారత్ జట్టు ఫుట్‌బాల్ ఆటగాళ్లు కువైట్‌పై పైచేయి సాధించారు.

Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్

మ్యాచ్‌లో తొలి అర్థభాగంలో కువైట్ దే పైచేయిగా సాగింది. 14వ నిమిషంలో అల్‌ఖాల్‌ది చేసిన గోల్‌తో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వెంటనే భారత్ బదులు తీర్చుకుంది. చాంగ్తె బంతిని నెట్‌లోకి పంపి స్కోరును సమం చేశాడు. ఇక ఘాటౌట్లో సునీల్ ఛెత్రి, సందేశ్ జింగాన్, చాంగ్తె, సుభాసిస్ బోస్, మహేశ్ గోల్ చేయగా.. ఉదాంత సింగ్ మాత్రమే గోల్ చేయడంలో విఫలమయ్యాడు. కువైట్ జట్టు నాలుగు ప్రయత్నాల్లో విజయం సాధించింది. భారత గోల్ కీపర్ గురుప్రీత్ సింగ్ సంధు కువైట్ ఆటగాడు హజియా పెనాల్టీని గోల్ చేయకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆట సడన్‌డెత్‌కు మళ్లింది. ఇందులో భారత్ తరపున మహేశ్ స్కోర్ చేయగా.. కువైట్ ఆటగాడు హజియా కొట్టిన షాట్‌ను గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ అడ్డుకోవడంతో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ జట్టు విజయం సాధించింది.

భారత్ సాధించిన విజయాలివే..

భారత జట్టు శాఫ్ ఫుట్‌బాల్ టైటిల్‌ను తొమ్మిదోసారి నిలబెట్టుకుంది. 1993, 1997,1999, 2005, 2009, 2011, 2015, 2021, 2023 సంవత్సరాల్లో భారత్ ఫుట్ బాల్ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్ లో విజయంతో 9వ సారి శాఫ్ ఛాంపియన్‌గా భారత్ జట్టు అవతరించింది.

 

ట్రెండింగ్ వార్తలు