Pathaan Trailer : దేశం కోసం వస్తున్న ‘పఠాన్’.. ఫైట్స్ అన్ని గాల్లోనే.. సూపర్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్..

తాజాగా పఠాన్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పఠాన్ తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేయడం విశేషం. ఇక ట్రైలర్ లోనే ఇండైరెక్ట్ గా కథ అంతా చెప్పేశారు...........

Pathaan Trailer :  దాదాపు అయిదేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ మళ్ళీ వెండితెరపై కనపడబోతున్నాడు. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ సినిమాతో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. షారుఖ్, దీపికా జంటగా, జాన్ అబ్రహం విలన్ గా తెరకెక్కుతున్న పఠాన్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. షారుఖ్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జనవరి 25న పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు.

తాజాగా పఠాన్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పఠాన్ తెలుగు ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేయడం విశేషం. ఇక ట్రైలర్ లోనే ఇండైరెక్ట్ గా కథ అంతా చెప్పేశారు. ఒక ప్రైవేట్ టెర్రరిస్ట్ గ్రూప్ డబ్బులు తీసుకొని పని చేస్తుంది. ఇండియాని నాశనం చేయడానికి ఈ గ్రూప్ డబ్బులు తీసుకొని ఇండియా మీద భారీ దాడి ప్లాన్ చేస్తుంది. ఈ పని జాన్ అబ్రహం తీసుకుంటాడు. అప్పుడు ఇండియా అధికారులు ఒక పాత ఆఫీసర్ అయిన పఠాన్(షారుఖ్) ని తీసుకొస్తారు. పఠాన్ కి తోడుగా దీపికా కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొంటుంది. ఆ టెర్రర్ గ్రూప్ నుంచి పఠాన్ దేశాన్ని కాపాడాడా లేదా అనేదే సినిమా కథాంశం.

Kiran Abbavaram : నన్ను ఇండస్ట్రీ నుంచి పంపిచేద్దాం అనుకుంటున్నారు.. కిరణ్ అబ్బవరం!

కథ మాములు కథ అయినా కథనాన్ని కొత్తగా చూపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ముఖ్యం కానున్నాయి. ఫైట్స్ అన్నీ గాల్లోనే ఉన్నట్టు చూపించారు. ట్రైలర్ లోనే చాలా యాక్షన్ సీక్వెన్స్ లు చూపించారంటే ఇక సినిమా అంతా యాక్షన్ సీక్వెన్స్ లు చాలా ఉండనున్నట్టు తెలుస్తుంది. నేలమీద, నీటిలో, గాలిలో ఫైట్స్ చేశారు. మొత్తానికి షారుఖ్ తన కంబ్యాక్ ని గ్రాండ్ గానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాతో షారుఖ్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు