Sreeleela : వామ్మో శ్రీలీల చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నాయా..

ప్రస్తుతం భారీ సినిమాలన్నిటికీ హీరోయిన్ గా బెటర్ ఆప్షన్ శ్రీలీలే కనిపిస్తోంది. వరుస అవకాశాలతో సైలెంట్ గా టాలీవుడ్ ను ఆక్రమించుకుంటోంది. ప్రజెంట్ శ్రీలీల సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే.

Sreeleela :  టాలీవుడ్ భారీ సినిమాలకు హీరోయిన్ గా బెటర్ ఆప్షన్ గా ఇప్పుడు శ్రీలీల పేరు ఒకటే వినిపిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగులో ఆమెవి రిలీజయిన సినిమాలు రెండే అయినా వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ ను సైలెంట్ గా ఆక్రమిస్తోంది యంగ్ సెన్సేషన్ శ్రీలీల. టాలీవుడ్ లో ఇటీవల కన్నడ బ్యూటీస్ హవా ఎక్కువవుతోంది. పూజాహెగ్డే, కృతిశెట్టి లాంటి బ్యూటీస్ హీరోయిన్స్ గా టాలీవుడ్ లో చక్రం తిప్పుతుండగా తాజాగా లిస్ట్ లోకి చేరిన మరో క్రేజీ కన్నడ బ్యూటీ శ్రీలీల.

ప్రస్తుతం భారీ సినిమాలన్నిటికీ హీరోయిన్ గా బెటర్ ఆప్షన్ శ్రీలీలే కనిపిస్తోంది. వరుస అవకాశాలతో సైలెంట్ గా టాలీవుడ్ ను ఆక్రమించుకుంటోంది. ప్రజెంట్ శ్రీలీల సినిమాల లైనప్ చూస్తే మతిపోవాల్సిందే. పెళ్ళిసందడి సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఆమె గ్లామర్ వల్ల టాక్ తో సంబంధం లేకుండా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చి మంచి విజయం కూడా సాధించింది. ఆ తర్వాత రవితేజ ‘ధమాకా’లో హీరోయిన్ గా నటించి ఫస్ట్ టైమ్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంటరయింది. ఆ సినిమాలో శ్రీలీల యాక్టింగ్, ముఖ్యంగా ఆమె డ్యాన్స్ కు ఆడియన్స్ అంతా ఫిదా అయిపోయారు. ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ కూడా శ్రీలీల మాయలో పడిపోయింది.

దీంతో ధమాకా తర్వాత వరుసగా శ్రీలీలకు ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం శ్రీలీల సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబో మూవీలో నటిస్తుండగా అందులో బాలయ్యకు కూతురి పాత్ర అని సమాచారం. వైష్ణవ్ తేజ్ 4వ సినిమా, నితిన్ 32వ సినిమా, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, రామ్ అండ్ బోయపాటి కాంబో మూవీస్ లో కూడా శ్రీలీలే హీరోయిన్ గా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. వీటితో పాటు కన్నడలో జూనియర్ అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.

SSMB 28 : డ్యూయల్ రోల్ లో మహేశ్.. త్రివిక్రమ్ – మహేశ్ సినిమా SSMB28 కూడా పాన్ ఇండియానా??

ఇవే కాకుండా అనౌన్స్ చేయనివి కూడా ఇంకో మూడు సినిమాల వరకు ఉన్నాయని సమాచారం. దీంతో టాలీవుడ్ లో దాదాపు 10 సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. వాటిలో సగం స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం. ఇప్పటికే రిలీజయిన రెండు సినిమాలతో హిట్స్ కొట్టిన శ్రీలీలకు ఇంకో రెండు హిట్స్ పడితే స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం.

 

ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోయిన్స్ కంటే శ్రీలీల తక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం, ధమాకాతో మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరవడ్డం, డ్యాన్స్ అదరగొడుతుండటం.. ఇలా బోలెడన్ని లెక్కలేసుకొని టాలీవుడ్ శ్రీలీలకు పిలిచి మరీ ఛాన్సులిస్తుంది. దీంతో శ్రీలీల ఇప్పుడు తెలుగులో బాగా బిజీగా మారిపోయింది. ఒక సినిమా తర్వాత ఒక సినిమా కాకుండా ఇప్పుడు ఒకే సారి నాలుగు సినిమాలకు డేట్స్ ఇచ్చి రోజూ షూటింగ్స్ కి వెళ్తుందంటే శ్రీలీల ఎంత బిజీగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు