SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నెక్ట్స్ షెడ్యూల్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాతో మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ మూడోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు రెడీ అవుతోంది.
Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి వెళుతున్న మహేష్.. SSMB28 షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు?
కాగా, ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ పూజా హెగ్డేను చిత్ర యూనిట్ ఇప్పటికే ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ త్రివిక్రమ్ తనదైన మార్క్‌ను చూపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాలో ఓ సెకండ్ హీరోయిన్ కూడా ఉంటుందని గతంలోనె వెల్లడించారు. అయితే ఈ సెకండ్ హీరోయిన్ పాత్రలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలను తీసుకున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపించింది. ఇక మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అనగానే శ్రీలీల కూడా వెంటనే ఓకే చేసిందట.
SSMB28: మహేష్ బాబు సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి శ్రీలీల వాకౌట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఆమె నటించిన ధమాకా మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ సక్సెస్‌ను అందుకోవడంతోనే శ్రీలీల ఈమేరకు మహేష్ మూవీ నుండి తప్పుకుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి చిత్ర యూనిట్ ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు. దీంతో ఈ సినిమా నుండి ఆమె వాకౌట్ చేసిన వార్తలు కేవలం పుకారే అని అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.