IIIT BASARA: బాసర ట్రిపుల్ ఐటీలో ఐదో రోజుకు చేరిన విద్యార్థుల ఆందోళన

రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపక పోస్టులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని, ల్యాబుల్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

IIIT BASARA: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఐదో రోజుకు చేరుకుంది. అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. శనివారం కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ తమ విద్యా సంస్థను సందర్శించాలని కోరుతున్నారు.

ED Raids: జేసీ సోదరుల ఇంట్లో ఈడీ తనిఖీలు పూర్తి

రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపక పోస్టులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని, ల్యాబుల్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు మెరుగుపరచాలని విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు ట్రిపుల్ ఐటీ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రత కొనసాగిస్తున్నారు. ట్రిపుల్ ఐటీకి రెండు కిలోమీటర్ల దూరం నుంచి పికెటింగ్ ఏర్పాటు చేశారు. విద్యా సంస్థ పరిసరాల్లో అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజకీయ నేతలు, తల్లిదండ్రులు సహా ఎవరినీ అనుమతించడం లేదు. నిరసన తెలిపేందుకు, సంఘీభావం ప్రకటించేందుకు వస్తున్న వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల డిమాండ్లపై సానుకూలంగానే ఉన్నామంటున్నారు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్. రెగ్యులర్ వీసీ నియామకం, సీఎం కేసీఆర్ బాసర పర్యటన మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు సానుకూలంగా ఉన్నామని సతీష్ కుమార్ అంటున్నారు.

Urea: అమెరికా నుంచి యూరియా దిగుమతులు పెంపు

మళ్లీ విద్యార్థులతో చర్చలు జరుపుతామని, మధ్యాహ్నం వరకు విద్యార్థుల డిమాండ్లపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. చర్చలు ఫలిస్తున్నాయని ఆయన చెప్పారు. ల్యాబుల్లో అదనపు సమయం పెంచడానికి అనుకూలంగా ఉన్నామని, ఇప్పటికే ట్రిపుల్ ఐటీకి పదిహేను వందల బెడ్లు చేరాయని, వాటిని ఈ వారంలో విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు. హాస్టల్‪‌లో ఇతర వసతులు మెరుగుపరుస్తామని, మెస్‌లో నాణ్యమైన భోజనం అందిస్తామని హామీ ఇస్తున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు