Nora Fatehi: గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్‌పై నోరా ఫతేహి ఆరోపణ

చంద్రశేఖర్‌తో నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిక్కీ తంబోలి, చాహత్ ఖన్నా వంటి హీరోయిన్లు కొంతకాలం సన్నిహితంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీళ్లకు సుకేష్ అప్పట్లో ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై కూడా విచారణ జరుపుతున్నారు.

Nora Fatehi: తన ప్రేయసిగా ఉండేందుకు అంగీకరిస్తే తనకు పెద్ద ఇల్లు ఇస్తానని సుకేష్ చంద్రశేఖర్ హామీ ఇచ్చాడని వెల్లడించింది బాలీవుడ్ నటి, మోడల్ నోరా ఫతేహి. రూ.215 కోట్ల మనీ లాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్ అరెస్టైన సంగతి తెలిసిందే. అతడిపై విచారణ కొనసాగుతోంది.

Amritsar: ప్రయాణికుల్ని వదిలేసి ఐదు గంటల ముందే వెళ్లిపోయిన విమానం.. విచారణకు ఆదేశించిన డీజీసీఏ

చంద్రశేఖర్‌తో నోరా ఫతేహి, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిక్కీ తంబోలి, చాహత్ ఖన్నా వంటి హీరోయిన్లు కొంతకాలం సన్నిహితంగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీళ్లకు సుకేష్ అప్పట్లో ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా నోరా ఫతేహి, ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టుకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చింది. ఈ సందర్భంగా సుకేష్ చంద్రశేఖర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ‘‘సుకేష్ నన్ను కావాలనుకున్నాడు. నేను తన గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానని ఆశ చూపాడు. అంతేకాదు.. లగ్జరీ లైఫ్‌స్టైల్ ఉంటుందని చెప్పాడు. ఎంతోమంది హీరోయిన్లకు అతడు అలా ఆశ చూపాడు.

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటలు అదుపు చేయలేకపోతున్న సిబ్బంది

అయితే, సుకేష్‌ను నేను నేరుగా ఎప్పుడూ కలవలేదు. అతడు తన సహాయకురాలైన పింకీ ఇరానీ ద్వారా ఈ ప్రతిపాదన తెచ్చాడు. నాకు అతడు ఎవరో తెలియదు. అతడు ఎల్ఎస్ కార్పొరేషన్ సంస్థలో పని చేస్తాడని భావించా. వ్యక్తిగతంగా అతడితో ఎప్పుడూ మాట్లాడలేదు. ఈడీ అధికారులు తన ఎదురుగా నన్ను విచారించినప్పుడు మాత్రమే మొదటిసారి అతడ్ని చూశా’’ అని నోరా ఫతేహి పాటియాలా కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చింది. ఈడీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేయడంతో నోరా ఈ విచారణకు హాజరవుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు