BheemlaNayak: ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. రానా బర్త్‌డే వీడియో వచ్చేసింది!

వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్..' ఇదీ రానా పుట్టినరోజు సందర్భంగా 'భీమ్లా నాయక్' నుంచి విడుదల...

BheemlaNayak: ‘వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను.. ఎవడాడు.. దీనమ్మ దిగొచ్చాడా.. ఆఫ్ట్రాల్ ఎస్ఐ.. సస్పెండెడ్..’ ఇదీ రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదల చేసిన డేనియల్ శేఖర్ పాత్ర మరో ప్రచార చిత్రంలో రానా డైలాగ్. రానా ఆవేశంగా పవన్ పాత్ర భీమ్లా నాయక్ ను ఉద్దేశించి చెప్తున్న ఈ డైలాగ్ సినిమా ఇంటెన్స్ ను తెలిసేలా చేస్తుంది. డేనియల్ శేఖర్, భీమ్లా నాయక్ ఈగోనే ఈ సినిమా సోల్. అందుకే ప్రతి అప్డేట్ లో ఇది మిస్ కాకుండా చూపిస్తున్నారు మేకర్స్.

OTT Release: ఈ వారం వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

పవన్, రానాల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే-సంభాషణలు త్రివిక్రమ్ అందిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ నాయికలు కాగా.. ప్రముఖ నటులు రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి వంటి భారీ తారాగణం కూడా ఉంది.

Film Releases: తగ్గేదేలే.. ఈ వారం రిలీజయ్యే సినిమాలివే

రానా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించి వీడియో విడుదల చేసి యూనిట్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ సినిమా జనవరి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి సినిమాల నుండి భీమ్లా నాయక్ తప్పుకుంటుందని పలుమార్లు రూమర్లు వచ్చినా మేకర్స్ మాత్రం అదే ముహూర్తానికి వచ్చేస్తామని ధీమాగా చెప్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు