Tarakaratna : వైరల్ అవుతున్న తారకరత్న పెదకర్మ పత్రిక.. ఆహ్వానితులుగా బాలయ్య, విజయసాయిరెడ్డి పేర్లు

ఇటీవల ఫిబ్రవరి 18న నటుడు తారకరత్న మరణించి నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తారకరత్నకు నివాళులు, అంత్యక్రియలు.. ఈ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారు..............

Tarakaratna :  ఇటీవల ఫిబ్రవరి 18న నటుడు తారకరత్న మరణించి నందమూరి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, టీడీపీ కార్యకర్తలకు తీరని శోకాన్ని మిగిల్చాడు. తారకరత్నకు నివాళులు, అంత్యక్రియలు.. ఈ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. బాలకృష్ణ, తారకరత్న మధ్య బాబాయ్-అబ్బాయిగా చాలా మంచి అనుబంధం ఉంది. దీంతో తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు కానీ, మరణించిన తర్వాత కానీ అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య బాబు.

ఇక తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చాలా దగ్గరి బంధువు అవడంతో ఆయన కూడా తారకరత్న నివాళులు, అంత్యక్రియలు కార్యక్రమాల్లో అక్కడే ఉండి బాలకృష్ణతో కలిసి పనిచేశారు. బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి అక్కడ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకున్నారు. ఆ తర్వాత చినకర్మ సమయంలోను ఇద్దరూ అక్కడే ఉండి పనులు జరిపించారు. తారకరత్న భార్యకు, ఆ కుటుంబానికి పక్కనే ఉండి భరోసా కలిపిస్తున్నారు.

దీంతో పార్టీల పరంగా ఇద్దరూ శత్రుత్వం చూపించినా, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నా వీరిద్దరూ తారకరత్న కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఒక్కటై దగ్గరుండి అన్నీ తామై పనులు జరిపించారు. దీంతో పార్టీల పరంగా ఎన్ని ఉన్నా, ఇలా కుటుంబం కోసం ఒక్కటై నిలబడటంతో అందరూ వీరిద్దర్నీ అభినందించారు. తాజాగా మరోసారి అంతా వీరిద్దర్నీ అభినందిస్తున్నారు. తారకరత్న పెదకర్మ కూడా వీరిద్దరే దగ్గరుండి చూసుకోబోతున్నరు. తాజాగా తారకరత్న పెదకర్మ తేది, స్థలం ప్రకటిస్తూ ఓ కార్డుని ముద్రించారు. ఈ కార్యక్రమానికి పిలిచేవారందరికి ఆ కార్డు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న పెదకర్మ ఆహ్వాన పత్రిక ఇప్పుడు వైరల్ అవుతుంది.

Tarakaratna : తారకరత్న అరుదైన ఫోటోలు..

ఆ కార్డుపై మార్చి 2న గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెదకర్మ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పేర్లు కార్డులో ప్రచురించారు. అలాగే కార్డు మీద తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లతో పాటు అలేఖ్యరెడ్డి ఫ్యామిలీ పేర్లని కూడా ప్రచురించారు. ఈ కార్యక్రమాన్ని కూడా బాలకృష్ణ, విజయసాయి రెడ్డి దగ్గరుండి నిర్వహిస్తుండటంతో మరోసారి అభిమానులు, నెటిజన్లు అంతా వీరిద్దర్నీ అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు