Sharwanand Movie Having 16 Songs Director Interesting Comments on Manamey Movie
Sharwanand Manamey Movie : సాధారణంగా ఒక సినిమాలో నాలుగు లేదా అయిదారు పాటలు ఉంటాయి. ఇటీవల కంటెంట్ తో తీసే సినిమాల్లో అసలు పాటలు కూడా తగ్గించేసారు. గతంలో పాత సినిమాల్లో పది పాటలు ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. కాని ఈ రోజుల్లో పాటలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది సినిమాకు అన్నట్టు తయారైంది పరిస్థితి. ఒకవేళ పాట ముందే రిలీజయి హిట్ అయితే తప్ప సినిమాలో ఆ పాటని ఎంజాయ్ చేయలేకపోతున్నారు ప్రేక్షకులు.
ఈ క్రమంలో ఏకంగా శర్వానంద్ సినిమాలో 16 పాటలు పెట్టడం గమనార్హం. శర్వానంద్, కృతిశెట్టి(Krithi Shetty) జంటగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ‘మనమే’ అనే సినిమా రాబోతుంది. జూన్ 7న ఈ సినిమా రిలీజవుతుండగా తాజాగా నేడు సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ దర్శకుడు ఈ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ.. ఈ మనమే సినిమా మొదట్నుంచి కూడా మ్యూజిక్ తో నడిచే సినిమా. ఈ సినిమాలో 16 పాటలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నేను ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాను. నా కెరీర్ లో ఈ సినిమా రీ రికార్డింగ్ కోసమే ఎక్కువగా కూర్చున్నాను అని తెలిపారు. దీంతో మరీ 16 పాటలేంటి బ్రో అంటూ శర్వానంద్, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యలను అడుగుతున్నారు నెటిజన్లు. అయితే అన్ని ఫుల్ లెంగ్త్ పాటలు కాకుండా కొన్ని బిట్ సాంగ్స్ తక్కువ లెంగ్త్ వి కూడా ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఆల్రెడీ మూడు పాటలు రిలీజ్ చేసారు. మరి సినిమా చూస్తే కాని తెలీదు ఆ 16 పాటలు ఏంటి? ఎందుకు పెట్టారు అన్న విషయం.
#Manamey is a musical extravaganza with a total of 16 songs. It is #HeshamAbdulWahab's best work.
Previously, Hesham's musical #HiNanna had around 12+ songs, including bit songs. pic.twitter.com/C33FtuM3vl
— Gulte (@GulteOfficial) June 1, 2024