Manamey Movie Child Artist : శర్వానంద్, కృతిశెట్టితో కలిసి నటించిన ఈ బాబు ఎవరో తెలుసా..? ఆ డైరెక్టర్ కొడుకే ఇలా..
తాజాగా నేడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాలో శర్వానంద్, కృతిశెట్టిలతో పాటు నటించిన ఆ చిన్ని బాబు ఎవరో తెలిపారు.

Sharwanand Krithi Shetty Manamey Movie Child Artist Details Here
Manamey Movie Child Artist : శర్వానంద్(Sharwanand), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా ‘మనమే’ అనే సినిమాతో రాబోతుంది. తాజాగా ఇవాళే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమాలో శర్వానంద్, కృతిశెట్టి భార్యాభర్తలు కాదు కాని ఓ చిన్నబాబుని పెంచుతున్నట్టు చూపించారు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ అని తెలుస్తుంది ఈ మనమే సినిమా. తాజాగా నేడు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ సినిమాలో శర్వానంద్, కృతిశెట్టిలతో పాటు నటించిన ఆ చిన్ని బాబు ఎవరో తెలిపారు.
Also Read : Sharwanand : దిల్ రాజు నాకు చెప్పలేదు.. శతమానం భవతి సీక్వెల్ పై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు..
మనమే సినిమాలో శర్వా, కృతిలతో పాటు ఫుల్ లెంగ్త్ నటించిన ఆ చిన్ని బాబు పేరు విక్రమ్ ఆదిత్య. ఈ సినిమా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తనయుడే ఈ విక్రమ్ ఆదిత్య. మనమే సినిమాని డైరెక్ట్ చేస్తున్న శ్రీరామ్ ఆదిత్య తన కొడుకునే ఈ సినిమాలో నటింపచేయడం గమనార్హం. విక్రమ్ ఆదిత్య గురించి పలువురు మాట్లాడుతూ.. అల్లరి చేసినా సినిమాలో బాగా నటించాడు ఆ చిన్న వయసులో, చాలా క్యూట్ గా నటించి అందరూ మెచ్చుకునేలా చేసాడు అని తెలిపారు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కూడా తన కొడుకు గురించి చెప్తూ గర్వపడ్డాడు.