Rajamouli done another Advertisement for Oppo Company Video goes Viral
Rajamouli : రాజమౌళి ఇప్పుడు ఒక బ్రాండ్. బాహుబలి (Bahubali) సినిమాతో దేశాన్ని, RRR సినిమాతో ప్రపంచాన్ని టాలీవుడ్ వైపు చూసేలా చేశాడు జక్కన్న. నాటు నాటుతో తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకురావడంతో వరల్డ్ వైడ్ స్టార్ అయ్యాడు రాజమౌళి. ఇక రాజమౌళికి వచ్చిన ఫేమ్ ని కొన్ని కంపెనీలు వాడకోవాలని ట్రై చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి గతంలోనే ప్రముఖ ఫోన్స్ కంపెనీ ఒప్పో కోసం ఓ యాడ్ చేశాడు. అంతేకాకుండా ఒప్పో (Oppo) కంపెనీ రాజమౌళిని తమ బ్రాండ్ అంబాసడర్ గా చేసుకుంది.
Also Read : Kiran Abbavaram : సొంతూళ్లో ఎడ్లబండి తోలి.. మాస్ డ్యాన్సులతో జాతరలో కుమ్మేసిన హీరో..
తాజాగా రాజమౌళి ఒప్పో కోసం మరో కొత్త యాడ్ చేశాడు. ఒప్పో కంపెనీ ఇండియా ఫోటోగ్రఫీ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తుంది. దీనికి ఎవరైనా ఎంట్రీలు పంపొచ్చు. దీనికోసం ఓ యాడ్ చేసి అందులో ధైర్యం ఉంటే ఈ ఫొటోగ్రఫీ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పాడు రాజమౌళి. దానికి సంబంధించిన సైట్, ఇతర డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే పోస్ట్ చేసారు.
దీంతో రాజమౌళి వీడియో వైరల్ గా మారింది. ఓ పక్కన రాజమౌళి మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు మొదలుపెడతాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే రాజమౌళి ఇలా యాడ్స్ చేయడంతో అభిమానులు మహేష్ సినిమా అప్డేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.