Kiran Abbavaram : సొంతూళ్లో ఎడ్లబండి తోలి.. మాస్ డ్యాన్సులతో జాతరలో కుమ్మేసిన హీరో..

తాజాగా కిరణ్ అబ్బవరం డ్యాన్స్ వీడియోలు, పూజలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Young Hero Kiran Abbavaram Mass Dance in his Village Jathara Videos goes Viral

Kiran Abbavaram : యువ హీరో కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా ఎదిగి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఓ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకున్నా ఆ తర్వాత కిరణ్ అబ్బవరంకు ఇప్పటివరకు పెద్ద హిట్ పడలేదు. కిరణ్ గత రెండు సినిమాలు మీటర్, రూల్స్ రంజన్ భారీ పరాజయం పాలయ్యాయి. ప్రస్తుతం కిరణ్ చేతిలో పలు సినిమాలు ఉన్నా హిట్ కొట్టాలని జాగ్రత్తగా చేస్తున్నాడు.

Also Read : Siddharth – Aditi : పెళ్లి కాకముందే హనీమూన్‌కి.. ఎంగేజ్మెంట్ తర్వాత వెళ్లిన హీరో, హీరోయిన్..

ఇక ఇటీవల మార్చ్ నెలలో తన మొదటి సినిమా హీరోయిన్ రహస్యని నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా కిరణ్ అబ్బవరం డ్యాన్స్ వీడియోలు, పూజలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరం సొంతూరు రాయచోటిలోని పెద కోడివాండ్ల పల్లిలో జరిగిన ఆంజనేయ స్వామి జాతరలో పాల్గొన్నాడు.

కిరణ్ అబ్బవరం ఈ జాతరలో పూజలు చేసి ఎండ్లబండి తోలి, అక్కడి కుర్రాళ్లతో కలిసి మాస్ డ్యాన్సులు వేసి సందడి చేసాడు. కిరణ్ మంచి మాస్ డ్యాన్స్ ఊళ్ళో కుర్రాళ్లతో కలిసి వేయడంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. హీరోగా ఎదిగినా సొంతూరికి వెళ్లి జాతరలో తన ఫ్రెండ్స్ తో కలిసి ఇలా డ్యాన్సులు వేస్తున్నాడంటే గ్రేట్ అని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు. ఎడ్లబండి కూడా తోలడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు తన సినిమాలు, సినిమా ప్రమోషన్స్, ట్రోల్స్ తో వైరల్ అయిన కిరణ్ అబ్బవరం మొదటిసారి తన మాస్ డ్యాన్సులతో వైరల్ అవుతున్నాడు.