Siddharth – Aditi : పెళ్లి కాకముందే హనీమూన్‌కి.. ఎంగేజ్మెంట్ తర్వాత వెళ్లిన హీరో, హీరోయిన్..
తాజాగా సిద్దార్థ్, అదితిరావు జంట హనీమూన్ కి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి.

Siddharth and Aditi Rao Hydari went Vacation to Italy Tuscany Photos goes Viral
Siddharth – Aditi Rao Hydari : హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని వార్తలు రాగా ఇటీవల సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించారు. ఎంగేజ్మెంట్ కి ముందు కూడా ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసారు. ఇక నిశ్చితార్థం తర్వాత రెగ్యులర్ గా కలిసి కనిపిస్తూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
Also Read : Chandini Chowdary : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరోయిన్.. అలా కుదిరిందా?
తాజాగా సిద్దార్థ్, అదితిరావు జంట హనీమూన్ కి వెళ్లిందని వార్తలు వస్తున్నాయి. ఈ జంట ఇటలీ దేశంలోని టస్కనీకి వెకేషన్ కి వెళ్లారు. అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ క్లోజ్ గా దిగిన ఫోటోలు ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. టస్కనీలో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలిపారు.
దీంతో సిద్దార్థ్, అదితి ఎంగేజ్మెంట్ చేసుకొని హనీమూన్ కి ఇటలీ వెళ్లారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సిద్దార్థ్, అదితి అక్కడే టస్కనీలోనే ఉన్నట్టు సమాచారం.