Chandini Chowdary : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరోయిన్.. అలా కుదిరిందా?

చాందిని చౌదరి మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటం గమనార్హం.

Chandini Chowdary : ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్న హీరోయిన్.. అలా కుదిరిందా?

Chandini Chowdary Two Movies Music Shop Murthy and Yevam Released on Same Day

Updated On : June 1, 2024 / 6:21 PM IST

Chandini Chowdary : మన తెలుగమ్మాయి చాందిని చౌద‌రి షార్ట్ ఫిలిమ్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోయిన్‌గా ఎదిగి వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తుంది. ఇటీవ‌లే ‘గామి’ సినిమాతో మంచి హిట్ అందుకున్న చాందిని త్వరలో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’, ‘యేవమ్’ సినిమాలతో రాబోతుంది.

అయితే చాందిని చౌదరి మెయిన్ లీడ్స్ లో నటించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండటం గమనార్హం. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడి జూన్ 14న రిలీజ్ అవుతుందని ఇటీవలే ప్రకటించారు. తాజాగా యేవమ్ సినిమా కూడా జూన్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ రెండూ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు కావడం, ఈ రెండిట్లో చాందిని చౌదరి మెయిన్ లీడ్ కావడం గమనార్హం.

Also Read : Sharwanand Manamey : ఏంది బ్రో.. ఒక్క సినిమాలో 16 పాటలా? శర్వానంద్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

యేవమ్ సినిమాలో చాందిని పోలీసాఫీసర్ గా కనిపించబోతుంది. నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణంలో ప్రకాష్‌ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యేవమ్. ఈ సినిమాలో చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌ రాజ్, అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ యేవమ్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో అజయ్ ఘోష్(Ajay Ghosh), చాందినీ చౌదరి.. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మాణంలో శివ పాలడుగు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ళ వ్యక్తి హైదరాబాద్ కి డీజే అవ్వాలని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఈ ప్రయాణంలో 25 ఏళ్ళ అమ్మాయితో అతని ప్రయాణం ఎలా సాగింది అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రానుంది.

Also Read : Manamey Movie Child Artist : శర్వానంద్, కృతిశెట్టితో కలిసి నటించిన ఈ బాబు ఎవరో తెలుసా..? ఆ డైరెక్టర్ కొడుకే ఇలా..

అయితే ముందుగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా జూన్ 14 అనౌన్స్ చేసినా ఇప్పుడు యేవమ్ సినిమా కూడా అదే డేట్ కి రిలీజ్ అనౌన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. గతంలో చాలా అరుదుగా ఒకే నిర్మాణ సంస్థ నుంచి సినిమాలు వచ్చాయి లేదా ఒక రోజు తేడాతో వచ్చాయి కాని ఒకే రోజు ఒకే హీరోయిన్ నుంచి రెండు సినిమాలు రావడం విశేషమే. మరి దీనికి చాందిని చౌదరి ఒప్పుకుందా? నిర్మాతలు ఒప్పించారా తెలియాలి. ఈ రెండు సినిమాలు చెప్పినట్టు ఒకే రోజు రిలీజవుతాయా? మళ్ళీ వాయిదా పడతాయా చూడాలి. ఒకవేళ మ్యూజిక్ షాప్ మూర్తి, యేవమ్ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే చాందిని ప్రమోషన్స్ కి ఎక్కువ కష్టపడాల్సిందే. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తుందో చూడాలి.