ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. సెల్ఫీలు దిగుతున్న వారిపై దూసుకెళ్లిన ట్యాంకర్

వీకెడ్ కావడంతో ఎయిర్ పోర్టు సమీపంలో ఫుడ్ కోర్టుకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు

water tanker

ORR Accident : రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ వద్ద కారును వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. పోలీస్ అకాడమీ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై కార్లు ఆపి యువతీ, యువకులు సెల్ఫీలు దిగుతున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా వారిపైకి వాటర్ ట్యాంకర్ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో యువతీ, యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పది మంది విద్యార్థులు ఉన్నారు.

Also Read : ఒంగోలులో దారుణం.. కొడుకును కాల్చిచంపిన ఏఆర్ కానిస్టేబుల్

ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీకెడ్ కావడంతో ఎయిర్ పోర్టు సమీపంలో ఫుడ్ కోర్టుకు వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగ్ పోలీసులు వాటర్ ట్యాంకర్ డ్రైవర్ డ్రైవర్ ప్రతాప్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.