ఒంగోలులో దారుణం.. కొడుకును కాల్చిచంపిన ఏఆర్ కానిస్టేబుల్

ఒంగోలులో దారుణం జరిగింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ కన్నకొడుకును తుపాకీతో కాల్చి చంపాడు.

ఒంగోలులో దారుణం.. కొడుకును కాల్చిచంపిన ఏఆర్ కానిస్టేబుల్

Ongole Police

Updated On : June 2, 2024 / 7:56 AM IST

Ongole : ఒంగోలులో దారుణం జరిగింది. ఓ ఏఆర్ కానిస్టేబుల్ కన్నకొడుకును తుపాకీతో కాల్చి చంపాడు. ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కె. ప్రసాద్ కొద్ది నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్డులో వి గ్రాండ్ ఎదురుగా కానిస్టేబుల్ కొదుముల ప్రసాద్ కుటుంబం జీవనం సాగిస్తుంది. 1998 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ ప్రసాద్ భాగ్య నగర్ లో ఈవీఎంసీ గోడౌన్ వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన కుమారుడు శేషసాయి (20) తండ్రిని డ్యూటీ దగ్గర వదిలేందుకు మోటారు బైకు మీద తీసుకెళ్లాడు. నెల మొదటి తేదీ కావడంతో జీతం రావడంతో ప్రసాద్ స్థానిక బ్యాంక్ వద్ద రూ.20వేలు డ్రా చేశాడు. డ్యూటీ స్థలం వద్ద తండ్రిని వదిలిన శేషసాయి రూ. 20వేలు ఇవ్వాలని అడిగాడు.

Also Read : తెలంగాణ సెంటిమెంట్ వాడుకుని లాభపడ్డారు- కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్

డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ కన్న కుమారుడిపైనే సర్వీస్ తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలపాలైన శేషసాయి అక్కడికక్కడే మరణించాడు. ప్రసాద్ కు ముగ్గురు సంతానం కాగా ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలకు వివాహమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శేషసాయి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కానిస్టేబుల్ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శేషసాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.