Telangana Formation Day Celebrations : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర సాధనకోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకున్నారు.అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎస్, డీజీపీ, అధికారులు స్వాగతం పలికారు. పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీ నేతలు హాజరయ్యారు.
సోనియా గాంధీ సందేశం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై 2004లో కరీంనగర్ లో ఇచ్చిన మాట నిబెట్టుకున్నాం.
సవాళ్లు ఎదురైనా తెలంగాణ ఇచ్చాం.
అమరుల ఆశయాలను మా ప్రభుత్వం పూర్తిచేస్తుంది.
తెలంగాణ అమరులకు నా నివాళులు.
జై తెలంగాణ అంటూ తన సందేశాన్ని ముగించిన సోనియా గాంధీ
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం.
కలను నెరవేర్చిన మన్మోహన్ , సోనియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.
పెత్తనాన్ని ప్రశ్నించడం తెలంగాణ నైజం.
స్వేచ్ఛను హరిస్తే సహించదు తెలంగాణ సమాజం.
పాలకుడు, ప్రజల మధ్య గోడలను బద్దలుకొట్టాం.
ప్రగతిభవన్ పూలే భవన్ గా ప్రజల్లోకి తెచ్చాం.
సచివాలయంలోకి సామాన్యుడికి వచ్చే అవకాశం ఇచ్చాం.
తప్పులు జరిగితే సరిదిద్దుకుని ముందుకెళ్తాం.
మీము సర్వజ్ఞాస్నులుగా భావించం.. అందరి సూచనలు తీసుకుంటాం.
పదేళ్లలో వందేళ్ల విద్వంసం జరిగింది.
రాష్ట్ర సంపద గుప్పెడు మందికి చేరింది.
తెలంగాణ ప్రధాత సోనియాను ఆహ్వానించాం.
ఏ హోదాలో సోనియాను ఆహ్వానిస్తున్నారనడం దురదృష్టం.
బిడ్డ ఇంట్లో శుభ కార్యానికి తల్లికి ఆహ్వానం కావాలా..?
సోనియాది తెలంగాణ తో పేగుబంధం.
జయజహే తెలంగాణ .. రాష్ట్ర అధికార గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం.
నూతన అధికారిక లోగోను రూపొందిస్తున్నాం.. అందరి సూచనల తర్వాత ప్రకటిస్తాం.
తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లి గుర్తుకురావాలి.
జాతి ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ తల్లి ఉంటుంది.
రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచే దిశగా పనిచేస్తున్నాం.