Telangana Movie Tickets Rate : సినిమా టికెట్ రేట్లపై కొత్త జీవో.. కేసీఆర్‌కు చిరు కృతఙ్ఞతలు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది.

Telangana Movie Tickets Rate : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సినిమా టికెట్ రేట్లను పెంచేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేసింది. టికెట్ ధరలు పెంచాలంటూ తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. దీనిపై స్పందించిన కేసీఆర్ టాలీవుడ్ సినీ పరిశ్రమ అభ్యర్థనను ఆమోదించాల్సిందిగా హోంశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు టికెట్ ధరలను సిద్ధం చేసి.. శనివారం జీవో విడుదల చేశారు.

చదవండి : Movie Theaters : అనంతపురంలో నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసేసిన యజమానులు

జీవో ప్రకారం ఏసీ థియేటర్లకు కనీస టిక్కెట్ ధర రూ.50, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల కోసం, కనిష్ట ధర రూ. 100+GST, గరిష్టంగా రూ.250+GST. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రిక్లైనర్ సీట్లకు, ధర రూ. 200 + జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 300 + జీఎస్‌టీ టిక్కెట్‌కు రూ. 5 (ఎసి) మరియు టిక్కెట్‌కు రూ. 3 (నాన్ ఎసి) నిర్వహణ ఛార్జీని వసూలు చేయడానికి థియేటర్‌లకు అనుమతి ఉంది.
చదవండి : RRR Movie : కపిల్ శర్మ షో లో ‘ఆర్ఆర్ఆర్’ టీం!

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్టు చేశారు చిరు. “తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు చెబుతున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు