TS High Court : టీచర్‌ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా..? : ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న

ఏ ఆధారంతో బదిలీల్లో టీచర్ల మధ్య వివక్ష చూపుతున్నారు..?టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా..? అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

TS High Court On Transfer Of Teachersm

TS High Court On Transfer Of Teachers : ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు సంధించింది. ఏ ఆధారంతో బదిలీల్లో టీచర్ల మధ్య వివక్ష చూపుతున్నారు..?టీచర్ ను పెళ్లి చేసుకుంటేనే బదిలీ చేస్తామంటే ఎలా..? అంటూ ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరణ ఇస్తు..ప్రభుత్వం భార్యాభర్తలు ఒకే చోట ఉండాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు.

ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు ఇచ్చామని అదనపు ఏజీ తెలిపారు. బదిలీల నిబంధనలను సవరించామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. నిబంధనల సవరణలను ఈనెల 4, 5 వ తేదీల్లో అసెంబ్లీ, కౌన్సిల్ ముందు ఉంచుతామని అదనపు ఏజీ వెల్డించారు. నిబంధనలో మార్పులపై ఏజీ హైకోర్టుకు మెమో సమర్పించారు. మెమో, కౌంటర్లపై కొంత సమయం ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.

RTC : ఆర్టీసీ గుడ్‌న్యూస్, టికెట్ ధరలపై 50 శాతం డిస్కౌంట్ ..

ఫిబ్రవరి 14 నుంచి స్టే ఉన్నందున బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని..త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి త్వరగా ఈ అంశంపై విచారణ జరపాలని ధర్మాసనాన్ని అదనపు ఏజీ కోరారు. దీంతో ఆగస్టు 23న దీనిపై వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.

 

ట్రెండింగ్ వార్తలు