Promotional Songs: భారీ బడ్జెట్‌తో ప్రమోషన్ సాంగ్స్ చేస్తున్న మేకర్స్!

టాలీవుడ్ లో ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. ఈవెంట్స్ కంటే ముందే.. సాంగ్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి సినిమాలు. సినిమాకు సంబంధించి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్స్ రిలీజ్ చ

Promotional Songs: టాలీవుడ్ లో ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. ఈవెంట్స్ కంటే ముందే.. సాంగ్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి సినిమాలు. సినిమాకు సంబంధించి స్పెషల్ ప్రమోషనల్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. ఫ్యాన్స్ లో సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు. సాంగ్స్ అంటే అలా ఇలా కాదు.. ఒరిజినల్ సాంగ్ కి ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తోనే ప్రమోషనల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు.

Kangana Ranaut: బాలీవుడ్‌పై అక్కసు.. కంగనా శ్రీరంగనీతులు!

సినిమాలో ఉండే సాంగ్ ని ప్రమోట్ చెయ్యడానికి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకప్పుడు స్పెషల్ గా ప్రమోషనల్ సాంగ్స్ ఉండేవి.. కానీ ఇప్పుడు సినిమాలో పాటల్నే డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు. సాంగ్స్ అంటే ఏదో లిరికల్ వీడియో లు, ఇమేజ్ లతో పాటలు రిలీజ్ చెయ్యడం కాదు.. గ్రాండ్ గా సెట్టేసి.. కాస్ట్లీ గెటప్పులేసి.. అదరిపోయే విజువల్స్ తో మోత మోగిపోయే బ్యాండ్ తో లక్షలు ఖర్చు పెట్టి భారీగానే ప్రమోషనల్ సాంగ్స్ చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా సర్కారు వారి పాట కళావతి సాంగ్ నెక్ట్స్ లెవల్ లో సాంగ్ ని ప్రమోట్ చేస్తోంది.

Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

లేటెస్ట్ గా మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి ధమన్ మ్యూజిక్ డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ కూడా చేసిన కళావతి ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. పంచె కట్టు, లంగాఓణీలతో సింగర్స్, మ్యుజీషియన్స్ ప్లజెంట్ థీమ్ లో సాలిడ్ సెట్టింగ్స్ తో భారీ గానే ఖర్చు పెట్టి ఈ సాంగ్ ని పిక్చరైజ్ చేశారు. కూల్ గా లవబుల్ గా సిధ్ శ్రీరామ్ ప్రజెంట్ చేసిన ఈ రొమాంటిక్ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.

Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!

సాంగ్స్ లో ఇలా వీడియోస్ తో ప్రమోట్ చెయ్యడం అంతకుముందు నుంచే ఉన్నా.. థమన్ వచ్చాఈ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లానాయక్ కు మ్యూజిక్ ఇస్తున్న థమన్.. పవర్ స్టార్ రేంజ్ కి సరిపోయే సాలిడ్ సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మాస్ కాప్ గా కనిపిస్తున్న పవర్ స్టార్ రేంజ్ మాస్ ని భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ లో చూపించారు. ఈ సాంగ్ ని.. థమన్ తన సింగర్స్ తో సాలిడ్ గా బ్లాక్ డ్రెస్ థీమ్ లోప్రజెంట్ చేసి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నారు.

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. వరుస సినిమాలకు సైన్ చేస్తున్న శ్రీలీల?

చిన్నా, పెద్దా అన్నతేడా లేకుండా ఏ సినిమా అయినా పాటకు స్ట్రెన్త్ ఇవ్వడానికి ట్రై చేసే థమన్.. గని సనిమాకు కూడా ఇదే రేంజ్ లో సాంగ్ ని ప్రమోట్ చేశారు. రోమియో, జూలియట్ అనే రొమాంటిక్ సాంగ్ కోసం ఏకంగా స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుర్ని దించారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న అదితి శంకర్ చేత పాడించి సాంగ్ కి నెక్ట్స్ లెవల్ క్రేజ్ తీసుకొచ్చాడు. ఇక ప్రజెంటేషన్ విషయంలో కూడా వైట్ అండ్ బ్లూ డ్రెస్ కోడ్ లో ఫీమేల్ క్రూతో కలిసి థమన్ తన క్రేజీ బాడీ లాంగ్వేజ్ తో సాంగ్ ని వేరే లెవల్లో ప్రమోట్ చేశారు.

Bheemla Nayak: కలెక్షన్ల సునామీకి పవర్ స్టార్ స్కెచ్… ఫ్యాన్స్‌కు పునకాలే!

అసలు సినిమాలో ఒరిజినల్ సాంగ్ ఎంత సింపుల్ గా సోబర్ గా ఉంటుందో.. దానికి క్వయిట్ కాంట్రాస్ట్ గా గ్రాండ్ గా కలర్ ఫుల్ గా ప్రమోషన్ చేసిన పాట సామజవరగమన. అలవైకుంఠపురంలో సినిమా రిలీజ్ కి నాలుగు నెలల ముందే రిలీజ్ అయిన సామజవరగమనా సాంగ్ సినిమా గ్రాఫ్ నే మార్చేసింది. థమన్, సిద్ద శ్రీరామ్ తమ మ్యుజీషియన్స్ తో కలిసి బ్లాక్ డ్రెస్ కోడ్ లో కలర్ ఫుల్ లైటింగ్ తో రాకింగ్ మ్యూజిక్ తో చేసిన ఈ సాంగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసింది.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

సాంగ్ కి ప్రమోట్ చెయ్యడంలో మరో లెవల్ కి వెళ్లిన యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బీస్ట్ అరబిక్ ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తోంది. డైరెక్టర్ నెల్సన్, అనిరుధ్, శివకార్తికేయ అరేబియన్ థీమ్ ని సెట్ చెయ్యడానికి క్రేజీ వీడియో చేశారు. అంతేకాదు.. ఈ పాటలో అరబిక్ డ్రెస్ తోనే పాడారు అనిరుధ్.

Pan India Movies: మన సినిమాకి మార్కెట్ క్రియేటర్లుగా పరభాషా నటులు!

ట్రిపుల్ఆర్ కూడా సాంగ్ ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు పెట్టింది. చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో జనని ఎమోషనల్ సాంగ్ ని కాలభైరవతో రస్టిక్ లొకేషన్స్ లో పిక్చరైజ్ చేశారు. ఇక దోస్తీ థీమ్ తో వచ్చిన పాటను చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఎన్టీఆర్, చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో పాటు పాన్ ఇండియా సింగర్స్, డాన్సర్స్ తో పాటను గ్రాండ్ గా షూట్ చేశారు మేకర్స్.

ట్రెండింగ్ వార్తలు