Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

లీకుల భయం వెంటాడుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీని. భారీ బడ్జెట్ సినిమాల ఆన్ లోకేషన్ విజువల్స్ తో రచ్చ చేస్తున్నారు లీక్ రాయుళ్లు. ముందే పట్టేసామంటూ పైరసీ ఫోటోలు, పాటలతో సోషల్ మీడియాను..

Movies Leakage: లీకుల భయం వెంటాడుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీని. భారీ బడ్జెట్ సినిమాల ఆన్ లోకేషన్ విజువల్స్ తో రచ్చ చేస్తున్నారు లీక్ రాయుళ్లు. ముందే పట్టేసామంటూ పైరసీ ఫోటోలు, పాటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు వీళ్లు. దీంతో డైరెక్ట్ గా రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చారు ఆర్ సీ15 మేకర్స్.

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

లీకు రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆఆర్ సీ15 మేకర్స్. ఈ మూవీ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అనధికారికంగా లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ట్వీట్ చేశారు. ప్రస్తుతం శంకర్ – చరణ్ కాంబో మూవీ షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. సీన్ అవసరాన్ని బట్టి అవుట్ డోర్ లో షూట్ చేస్తున్నారు డైరెక్టర్ శంకర్. అయితే అదే అదనుగా ఈ విజువల్స్ ను మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలే వాళ్లను.. వదిలేదే లేదన్నారు నిర్మాతలు.

Aishwarya Dharnush: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. వెనక్కు తగ్గారా?

వెరీ రీసెంట్ గా సర్కారు వారి పాట కళావతికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు టీమ్. ఒకరోజు ముందుగానే పైరసీ సాంగ్ బయటికి రావడంతో హార్ట్ బ్రేక్ అయిందంటూ ట్వీట్ చేశాడు తమన్. సర్కారు వారి పాటకు సంబంధించి గతంలో కూడా లీకుల ఇబ్బందులు ఎదురయ్యాయి. మహేశ్ బాబు నటిస్తోన్న సీన్స్ తో పాటూ కొన్ని ఫోటోలు అనఫీషియల్ గా బయటికొచ్చాయి.

Acharya: హిందీలో ఆచార్య మెగాస్టార్.. బాలీవుడ్ నిర్మాతలతో సంప్రదింపులు?

ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి సైతం ట్రిపుల్ ఆర్ లీకుల నుంచి తప్పించుకోలేకపోయారు. వకీల్ సాబ్ తో పాటూ భీమ్లా నాయక్ నుంచి కూడా పవన్ పైరసీ వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి. సలార్ లీక్స్ తో ప్రభాస్ ఇదే ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఇలా స్టార్ హీరోలకు, భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు ఈ పైరసీ కంటెంట్ పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఇప్పుడు మరింత స్ట్రిక్ట్ అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు