Tollywood : త్వరలో సీఎం కేసీఆర్‌తో తెలుగు సినీపరిశ్రమ సమావేశం.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కామెంట్స్..

సినీ పరిశ్రమను డెవలప్ చేయడానికి, సినీ పరిశ్రమలోని సమస్యల్ని తీర్చడానికి మరోసారి సినీ పెద్దలు సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. తాజగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం 10 టీవీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

TFDC Chairman Anil Kurmachalam said that CM KCR will meet with Tollywood soon

TFDC Chairman Anil Kurmachalam :  తెలంగాణ(Telangana) ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(KTR), మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) సినీ పరిశ్రమలోని వ్యక్తులకు దగ్గరగా ఉంటూ సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని పనులు చేస్తున్నారు. సినీ పరిశ్రమకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. సినీ పెద్దలు కూడా ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలని వివరించారు.

ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమను డెవలప్ చేయడానికి, సినీ పరిశ్రమలోని సమస్యల్ని తీర్చడానికి మరోసారి సినీ పెద్దలు సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. తాజగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం 10 టీవీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

Chiranjeevi : మెగాస్టార్ నెక్స్ట్ సినిమాలు ఇవేనా..? ఆ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చాడా?

TFDC చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. అన్ని పరిశ్రమాలలాగే సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి చెందాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంకా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరిద్దాం అని అన్నారు. మంత్రి తలసాని సారథ్యంలో త్వరలోనే సినీ పరిశ్రమ వ్యక్తులతో సీఎం కేసీఆర్ గారిని కలుస్తాము. చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి ఈ మీటింగ్ ఉండబోతుంది. ఇంకా మంచి పాలసీలు తీసుకువచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. హైదరాబాద్ లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ సిటీ కూడా పెట్టాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. దీనిపై త్వరలో కేసీఆర్ గారే సినీ పరిశ్రమల వాళ్ళని పిలిచి ఇంకో మీటింగ్ పెట్టే అవకాశం ఉంది అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు