Raj Tarun : రేపే రాజ్ తరుణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. మీడియా ముందుకు వస్తాడా?

రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు' సినిమా జులై 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఓ కేసు వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే.

Raj Tharun Purushothamudu Movie Pre Release Event will Raj Tarun Face media

Raj Tarun : రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ సినిమా జులై 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. రాజ్ తరుణ్, హాసిని సుధీర్ జంటగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మాణంలో రామ్ భీమన దర్శకత్వంలో పురుషోత్తముడు సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా.. లాంటి చాలా మంది స్టార్స్ నటించారు.

అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ ఓ కేసు వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అబార్షన్ చేయించి ఇప్పుడు మోసం చేసాడని ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు రాజ్ తరుణ్ కి నోటీసులు ఇచ్చారు. గత వారం రోజులుగా ఈ వివాదం నడుస్తూ ఉంది.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజ్ తరుణ్ ప్రమోషన్స్ కి కూడా వచ్చేలా లేడు. ఆల్రెడీ తన ఫోన్ నంబర్ కూడా మార్చేశాడు.

Also Read : Rajamouli : రాజమౌళిపై డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్.. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఏం మాట్లాడారంటే..

అయితే ఈ వివాదం మొదలయ్యాకే పురుషోత్తముడు సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం గమనార్హం. రాజ్ తరుణ్ అలా కేసులో ఇరుక్కోవడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు. కానీ రిలీజ్ ముందు ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. రేపు జులై 23 ఉదయం హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్లో పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.

దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చర్చగా మారింది. రాజ్ తరుణ్ లేకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తారా? రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా? రాజ్ తరుణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాని ఫేస్ చేస్తాడా? అని అందరిలోనూ సందేహం ఉంది. ఈ వివాదం మొదలయ్యాక ఒకేఒకసారి రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చాడు. అప్పట్నుంచి మళ్ళీ రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ వివాదం గురించి తెలుసుకోడానికి మీడియా నుంచి రాజ్ తరుణ్ కి ఫోన్స్, మెసేజ్ లు తెగ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ మీడియా ముందుకు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా అనేది డౌటే. రాజ్ తరుణ్ రేపు పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తాడా లేదా చూడాలి మరి.

 

ట్రెండింగ్ వార్తలు