Rajamouli : రాజమౌళిపై డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్.. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఏం మాట్లాడారంటే..

దర్శకధీరుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ 'మోడ్రన్ మాస్టర్స్' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Rajamouli : రాజమౌళిపై డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్.. చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఏం మాట్లాడారంటే..

Netflix Rajamouli Documentary Modern Masters Trailer Released

Updated On : July 22, 2024 / 1:54 PM IST

Rajamouli Modern Masters : మన టాలీవుడ్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. కలే అనుకున్న ఆస్కార్ ని మన తెలుగు సినిమాకు సాధించి తీసుకొచ్చారు రాజమౌళి. రాజమౌళి చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. బాహుబలితో పాన ఇండియా సినిమా, రెండు పార్టులు అనే ఆనవాయితీని మొదలు పెట్టి RRR తో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ సినిమాలకు గుర్తింపు తెచ్చారు.

దర్శకధీరుడు రాజమౌళిపై నెట్ ఫ్లిక్స్ ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ నిర్మించింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో జేమ్స్ కామెరూన్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, కరణ్ జోహార్, రమా రాజమౌళి.. ఇలా పలువురు రాజమౌళి గురించి మాట్లాడారు. చివరో రాజమౌళి.. నేను కేవలం నా కథకు మాత్రమే బానిసగా ఉంటాను అని చెప్పడం గమనార్హం.

Also Read : Rupali Singh – Vicky Kaushal : పల్లెటూరి మహిళ డ్యాన్స్ వైరల్.. బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్..

దీంతో ఈ డాక్యుమెంటరీ కోసం రాజమౌళి అభిమానులతో పాటు, పాన ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మోడ్రన్ మాస్టర్ డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. మీరు కూడా ఈ మోడ్రన్ మాస్టర్స్ – రాజమౌళి ట్రైలర్ చూసేయండి..