The Conjuring: హర్రర్ సినిమాల పెద్దన్న ‘ది కాంజురింగ్’.. మూడో పార్ట్ రేపే విడుదల!

హర్రర్ సినిమాలకు ఇప్పుడున్న భారీ క్రేజ్ తెలియాలంటే ముందుగా ది కాంజురింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికి విడుదలైన ఈ సిరీస్ రెండు పార్టులు ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్స్ సాధించాయి. కోట్లకు కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా నుండి ఇప్పుడు మరో పార్ట్ విడుదలకు సిద్ధమైంది.

The Conjuring: హర్రర్ సినిమాలకు ఇప్పుడున్న భారీ క్రేజ్ తెలియాలంటే ముందుగా ది కాంజురింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికి విడుదలైన ఈ సిరీస్ రెండు పార్టులు ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్స్ సాధించాయి. కోట్లకు కోట్ల కలెక్షన్లను సాధించిన ఈ సినిమా నుండి ఇప్పుడు మరో పార్ట్ విడుదలకు సిద్ధమైంది. ‘ది కాంజురింగ్: ది డెవిల్‌ మేడ్‌ మీ డు ఇట్‌’ అంటూ వస్తున్న ఈ సినిమా రేపే (13-8-21) విడుదల కానుంది.

ఇంతకు ముందే వచ్చిన పార్ట్‌-1, పార్ట్‌-2లకంటే ‘ది కంజురింగ్‌: ది డెవిల్‌ మేడ్‌ మీ డు ఇట్‌’ చిత్రాన్నిప్రత్యేకంగా తెరెక్కించినట్లు దర్శక-నిర్మాత మైఖేల్‌ ఛావెస్‌యే పేర్కొన్నాడు. కాగా ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ ఈ మూవీని మన దేశంలోని ముఖ్యమైన నగరాల్లో విడుదల చేయనుంది. హర్రర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది నిజంగా బెస్ట్ సినిమాగా మేకర్స్ ధీమాగా ఉన్నారు.

ఇప్పటికి విడుదలైన రెండు పార్టుల సక్సెస్ తో ప్రపంచ వ్యాప్తంగా భారీ బిజినెస్ సొంతం చేసుకున్న ఈ సినిమా మన దేశంలో కూడా అన్ని బాషలలో డబ్బింగ్ తో పాటు ఒరిజినల్ కూడా విడుదల కానుండగా తెలుగులో ఇప్పటికి ‘ది కాంజురింగ్.. దెయ్యం నా చేత చేయించింది’ పేరుతో విడుదల కానుంది. ఇప్పటికి తెలుగు ట్రైలర్ కూడా ఆసక్తిగా కనిపిస్తున్న ఈ సినిమా రిజల్ట్ ఏంటన్నది రేపు తెలియనుంది.

ట్రెండింగ్ వార్తలు