New Film Releases: ఈ ఏడాదికి చివరిరోజు విడుదలయ్యే సినిమాలివే!

2021 లాస్ట్ డే... ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఈ నెల 31.. చివరి శుక్రవారం బిగ్ స్టార్స్ ఎవరూ హాళ్లకి రావట్లేదు కానీ చిన్న సినిమాలు చాలానే రిలీజ్..

New Film Releases: 2021 లాస్ట్ డే… ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఈ నెల 31.. చివరి శుక్రవారం బిగ్ స్టార్స్ ఎవరూ హాళ్లకి రావట్లేదు కానీ చిన్న సినిమాలు చాలానే రిలీజ్ కాబోతున్నాయి. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్ తర్వాత ఈ వీక్ మేమూ హిట్ కొడతామంటోన్న కొందరు స్టార్స్. వాయిదాల మీద వాయిదాల తర్వాత చివరికి డిసెంబర్ 31న గుడ్ లక్ సఖి వస్తుందన్నారు మేకర్స్. కీర్తి సురేశ్ బంజారా పిల్లగా నటించిన ఈ సినిమా ఆమె ఫ్యాన్స్ ను ఇదిగో ఇప్పుడే అంటూ ఎప్పటికప్పుడు ఊరిస్తూనే ఉంది. మరీ ఇయర్ ఎండ్ రోజైనా థియేటర్స్ కొస్తుందో, లేదో చూడాలి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీ రోల్స్ చేసారు గుడ్ లక్ సఖిలో. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం స్పెషల్. మరి షూటర్ గా మహానటి మెప్పిస్తుందో.. మళ్లీ వాయిదా అంటుందో చూడాలి.

Akshay Kumar: బాలీవుడ్ ఖిలాడీ దూకుడు.. వచ్చే ఏడాది కూడా నాదే!

శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తేజ మర్ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా అర్జున ఫల్గుణ. కంటెంట్ రిచ్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు ఈ ఇయర్ మరోసారి “అర్జున ఫాల్గుణ” యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్స్ కొస్తున్న ఈ హీరో ఈ సినిమాపై గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. అర్జునా ఫాల్గుణ ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే ఉంది. ఈ లాస్ట్ ఫ్రైడే.. టీమ్ కి లక్కీగా మారుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

Samantha: టాలీవుడ్ టూ హాలీవుడ్.. టాప్ గేర్‌లో దూసుకుపోతున్న సామ్!

డిసెంబర్ 31న 1945 పీరియాడికల్ డ్రామాను చూపించబోతున్నాడు రానా. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ ప్రాజెక్ట్ లో రానా స్వాతంత్ర్య సమరయోధుడిగా కనిపించబోతున్నాడు. సత్యరాజ్, నాజర్ లాంటి సీనియర్స్ ఉన్నారిందులో. సత్యశివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తై సంవత్సరాలు గడిచాయి. చివరకి 2021 చివరి రోజుకు రిలీజ్ ఫిక్స్ చేసారు నిర్మాత సి. కల్యాణ్.

Malaika Arora: ఈ వయసులో హైహీల్స్ అవసరమా.. మలైకాకు నెటిజన్ల ట్రోలింగ్!

నవనీత్‌ చారి దర్శకత్వంలో సోనీ అగర్వాల్‌ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్‌ సత్యభామ’. ఈ మూవీ ఈ వీక్ థియేటర్లలో విడుదలవుతుంది. దీంతో పాటూ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ వధు కట్నం, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలు చూపించబోతున్న సాఫ్ట్ వేర్ బ్లూస్ వంటి సినిమాలు 31న రిలీజ్ కాబోతున్నాయి. అలాగే తమిళ్ డబ్బింగ్ సినిమా అంతపురం కూడా ఈ శుక్రవారమే రాబోతుంది. ఆర్య, రాశీ ఖన్నా, ఆండ్రియా హీరో హీరోయిన్లుగా నటించారు అంతపురంలో.

Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!

ట్రెండింగ్ వార్తలు