Viral Video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు నెటిజన్లను భలే ఆకర్షిస్తుంటాయి. వీడియో నచ్చితే మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. తాజాగా కప్పల వీడియో ఒకటి 13 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ట్విట్టర్లో దూసుకెళ్తోంది. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఒక కప్ప నీళ్లలో బాటిల్ మూతపై కూర్చొని ఉంటుంది.
Salman Rushdie: సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు.. నిందితుడిని ప్రశంసించిన ఇరాన్ మీడియా
అది నీటిపై తేలియాడుతుంటే మరో కప్ప ఆ మూతపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే మరో కప్ప దాన్ని అడ్డుకుంటుంది. నీళ్లలో ఉన్న కప్ప మూతపైకి ఎక్కగానే, మరో కప్ప కాలితో తన్ని తోసేస్తుంది. దీంతో నీళ్లలోపడ్డ కప్ప తిరిగి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఈసారి కూడా ఆ కప్పను మూతపైకి రాకుండా అడ్డుకుంటుంది. 11 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కావాలంటే మీరూ చూడండి.
Final scene of the Titanic.. pic.twitter.com/3V37QXEPaw
— Buitengebieden (@buitengebieden) August 11, 2022