Jabardasth Faima Introduced his Boy Friend Praveen Nayak on her Birthday
Jabardasth Faima : పటాస్, జబర్దస్త్ షోలతో పాపులారిటీ సంపాదించింది ఫైమా. ఆ ఫేమస్ తో పలు ఈవెంట్స్, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉన్నటు గతంలో వార్తలు వచ్చాయి. షోలో వీళ్ళిద్దర్నీ జంటగా చూపించడంతో అంతా నిజంగానే వీరు ప్రేమలో ఉన్నారనుకున్నారు. ఫైమా కూడా ప్రవీణ్ ని తన ఇంటికి తీసుకెళ్లి, ఇంట్లో వాళ్లతో కలిసి పలు వీడియోలు తీసింది. ప్రవీణ్ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. వీరిద్దరూ చేసిన పనులకు నిజంగానే ప్రేమలో ఉన్నారు అనుకున్నారు.
Also Read : Indian 2 Update : ఒకేసారి ఇండియన్ 2 సినిమా నుంచి బోలెడన్ని అప్డేట్స్.. రిలీజ్ డేట్ కూడా..
తాజాగా ఫైమా తన ప్రియుడిని పరిచయం చేసింది. నిన్న తన పుట్టిన రోజు కావడంతో ఫైమా బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ తనతో కలిసి దిగిన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేస్తూ.. ఐదేళ్లు ఎలా గడిచిపోయాయి తెలీదు. జీవితం అంతా నీతో ఉండాలి అనుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే మై లవ్ అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కింద పలువురు నెటిజన్లు అయిదేళ్లుగా ఇతనితో ప్రేమలో ఉన్నప్పుడు ప్రవీణ్ ని ఎందుకు తీసుకొచ్చావు మధ్యలో, అతనితో ఎమోషనల్ డ్రామాలు ఎందుకు నడిపావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలోనే తన ప్రియుడు ప్రవీణ్ తో పలు రీల్స్ చేసింది కానీ అధికారికంగా ప్రకటించలేదు.
అయితే ప్రవీణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకి నిజంగానే ప్రపోజ్ చేసినట్టు, అయితే ఫైమా నో చెప్పిందని, కేవలం షోల వరకే ఆ జంట అని తెలిపాడు. ఇప్పుడు ఫైమా తన ప్రియుడ్ని పరిచయం చేయడంతో మరి ప్రవీణ్ ఏమైనా స్పందిస్తాడా చూడాలి.