Sarkaar Season 6: సర్కార్ సీజన్ 6 ప్రోమో వచ్చేసింది.. ఈసారి ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ పక్కా
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో స్ట్రీమ్ అయ్యే సర్కార్ సీజన్ 6 (Sarkaar Season 6)ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
Sudigali sudheer sarkaar season 6 promo out now
Sarkaar Season 6; ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అయ్యే సర్కార్ గేమ్ షోకి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సుడిగాలి సుధీర్ హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు సరికొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది. తాజాగా దీనికి సంబందించిన ప్రోమో(Sarkaar Season 6) విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో చూశాక ఈసారి ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుంది అని పక్కాగా అర్థమవుతోంది.
Bloody Romeo: నాని- సుజీత్ మూవీ ‘బ్లడీ రోమియో’.. గ్యాంగ్ స్టరా, వంట మనిషా?
ఇక ఈ ప్రోమోలో ఎప్పటిలాగే సుధీర్ తన టైపు కామెడీ టైమింగ్ తో అదరగోటేశాడు. హెబ్బా పటేల్, రాశి సింగ్, గేహన సిప్పి, పాయల్ రాజ్ పుత్ లతో మనోడు చేసిన కామెడీ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక ఆ తరువాత వచ్చిన అఖిల్, మోనాల్ గజ్జర్ కూడా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. మరో ప్రోమోలోనే ఈ రేంజ్ ఫన్ ఉంది అంటే ఎపిసోడ్స్ లో ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయి అనేది మన ఊహకే వదిలేశారు మేకర్స్. మరి ఈ కొత్త సీజన్ ఏ శుక్రవారం అంటే ఫిబ్రవరి 27 సాయంత్రం 7 గంటల నుంచి మొదలుకానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.
