Indian 2 Update : ఒకేసారి ఇండియన్ 2 సినిమా నుంచి బోలెడన్ని అప్డేట్స్.. రిలీజ్ డేట్ కూడా..
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఒకేసారి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చారు మూవీ యూనిట్.

Kamal Haaasan Shankar Indian 2 Movie
Indian 2 Update : శంకర్(Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal Haasan) మెయిన్ లీడ్ గా 1996లో వచ్చిన ఇండియన్(భారతీయుడు) సినిమా అప్పట్లో భారీ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఇండియన్ 2, ఇండియన్ 3 సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే షూటింగ్ అయిపోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా ఆపి మరీ ఇండియన్ షూటింగ్ కి వెళ్ళాడు. కమల్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు కొన్ని పోస్టర్స్ తప్ప సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
తాజాగా ఇండియన్ 2 సినిమా నుంచి ఒకేసారి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చారు మూవీ యూనిట్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. శంకర్, కమల్ ఐపీఎల్ తో పాటు ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ గురించి అప్డేట్స్ తెలిపారు.
Also Read : Kangana Ranaut : ఎంపీగా గెలిస్తే సినిమాలు మానేస్తాను.. బాలీవుడ్ క్వీన్ సంచలన ప్రకటన..
ఇండియన్ 2 సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో జూన్ 1న భారీగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి చాలామంది తమిళ్, తెలుగు స్టార్స్ రాబోతున్నట్టు సమాచారం. అలాగే సినిమాని జులైలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. డేట్ మాత్రం త్వరలో చెప్తారని సమాచారం. ఇన్నాళ్లు ఎదురుచూసిన సినిమా జులైలో రాబోతుందని ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలోని మొదటి పాటని మే 22న రిలీజ్ చేయబోతున్నారు. అనిరుద్ సంగీత దర్శకత్వంలో ఈ పాట కంపోజ్ చేస్తున్నారు.
ఇక ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ.. ఇలా చాలామంది స్టార్స్ నటిస్తున్నారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి.
Vanakkam INDIA! ?? The 1st single from INDIAN-2 in Rockstar ANIRUDH musical is dropping on May 22nd! ? Get ready to welcome the comeback of SENAPATHY! ?? Releasing worldwide in cinemas 12th July 2024! ??#Indian2 ?? #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/9xcsaDTVf5
— Lyca Productions (@LycaProductions) May 19, 2024