Anupama Parameswaran : ఏంటి నిజమేనా..? తనకన్నా రెండేళ్లు చిన్నవాడితో అనుపమ ప్రేమాయణం..?
వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది సినిమాలో. (Anupama Parameswaran)
Anupama Parameswaran
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ భామకు కమర్షియల్ హిట్స్ లేకపోయినా, స్టార్ హీరోల సినిమాల్లో చేయకపోయినా చిన్న, మీడియం రేంజ్ వరుస సినిమాలు చేస్తూ, సోషల్ మీడియాలో తన ఫొటోలతో బాగానే ఫేమ్ తెచ్చుకుంది. ఒకప్పుడు పద్ధతి గల పాత్రలు మాత్రమే చేసిన అనుపమ పరమేశ్వరన్ గత కొన్నాళ్లుగా రొమాంటిక్ సీన్స్ ఉన్న పాత్రలు, లిప్ కిస్ సీన్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తూ బోల్డ్ నటి అనిపించుకుంటుంది.(Anupama Parameswaran)
గత కొన్ని రోజులుగా అనుపమ పరమేశ్వరన్ విక్రమ్ తనయుడు, హీరో ధృవ్ విక్రమ్ తో డేటింగ్ చేస్తుందని, ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. అనుపమ పరమేశ్వరన్, ధృవ్ కలిసి బైసన్ అనే తమిళ్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయింది సినిమాలో.
బయట కూడా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో అనుపమకి స్టేజిపై ధృవ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పగా అనుపమ సిగ్గుపడిన వీడియో బాగా వైరల్ అయింది. ఇక వీరిద్దరూ తాజాగా మరో ఈవెంట్ లో కనిపిస్తే క్లోజ్ గా దిగిన సెల్ఫీలు వైరల్ గా మారాయి. ఈ సెల్ఫీలను ధృవ్, అనుపమ తమ సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. ఓ ఇంటర్వ్యూలో అర్ధరాత్రి కాల్ చేయాల్సి వస్తే ఎవరికీ చేస్తారు అని అడగ్గా అనుపమ ధృవ్ విక్రమ్ పేరే చెప్పింది. ఇలా వరుసగా పలు సంఘటనలతో ఫ్యాన్స్, నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటున్నారు.

అనుపమ పరమేశ్వరన్ కి 30 ఏళ్ళు. ధృవ్ విక్రమ్ కి 28 ఏళ్ళు. దీంతో అనుపమ తనకంటే రెండేళ్లు చిన్నవాడితో ప్రేమలో ఉందని అంటున్నారు. మరి వీళ్లది ప్రేమ లేక స్నేహమా వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అనుపమ కానీ ధృవ్ కానీ వీరిపై వచ్చే రూమర్స్ పై స్పందించట్లేదు.

Also Read : Prabhas : విజయవాడలో బండి మీద.. ప్రభాస్ పునుగుల ఎమోషన్ తెలుసా?
