AP Rain Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వానలేవానలు.. వారికి వాతావరణశాఖ కీలక హెచ్చరికలు.. పిడుగులు పడే చాన్స్..
AP Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
AP Rain Alert
- నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
- 48గంటల్లో అల్పపీడనంగా బలపడే చాన్స్
- ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు
- వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ
AP Rain Alert : మరికొద్దిరోజుల్లో మార్చి నెల ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మరో పదిరోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read : మండలిలో ప్లకార్డులు, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఛైర్మన్ టేబుల్‌పై పడేసిన వైసీపీ సభ్యులు.. రచ్చ రచ్చ
బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనం (low pressure) గా మారనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (Andhra Pradesh State Disaster Management Authority) వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండడంతో ఏపీలో వాతావరణ చల్లబడనుంది.
ఇవాళ, రేపు (ఆదివారం) కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంపడే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికందే దశలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న, మిర్చి, ఇతర పంటలు కోత దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులను రైతులు కల్లాల్లో ఆరబోశారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ వర్షం సూచనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే, వర్షాలు కురిసే ప్రభావం ఉండటంతో రైతులు ముందస్తుగా తగిన జాగ్రతలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మరోవైపు.. రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత వారం రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండల తీవ్రత ఇలాఉంటే.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్ర ఏ స్థాయిలో ఉంటుందోనని ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
▪️హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని #APSDMA తెలిపింది. ఆతర్వాత పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందందని పేర్కొంది.#AndhraPradesh#WeatherUpdate #Lightningstrike pic.twitter.com/ndzW6NAxCg
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) February 20, 2026
