AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు శుభవార్త..
AP Govt : ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
Good News for DWCRA Womens in AP
AP Govt : ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. గ్రామీణ బ్యాంకుల నుంచి స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై 2026 జూలై 1 నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ ప్రకటించింది. మహిళలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read : Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్జీ ఎఫెక్టా?
రూ.5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న 13 శాతం వడ్డీని 12 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. తాజా నిర్ణయంతో అధిక మొత్తంలో రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాలకు కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే రుణాలపై వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్స్పెక్షన్ ఛార్జీలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఇప్పటికే చర్యలు చేపట్టాయి.
ఇదిలాఉంటే.. బ్యాంకు రుణాలపై ప్రభుత్వం అందించే సున్నా వడ్డీ పథకం ప్రయోజనాలు పొందాలంటే రుణ వాయిదాలు (EMIs) నిర్ణీత గడువులోగా చెల్లించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. సమయానికి వాయిదాలు చెల్లించిన స్వయం సహాయక సంఘాలకే ఈ రాయితీలు పూర్తిస్థాయిలో వర్తిస్తాయని తెలిపారు.
ప్రభుత్వం తాజా నిర్ణయంతో గ్రామీణ బ్యాంకుల్లోని సుమారు 2.75 లక్షల మహిళా సంఘాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇప్పటికే డ్వాక్రా సంఘాల్ని బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ నిర్ణయాలు వెలువడ్డాయి.
