Vizianagaram Politics: బొత్స సొంత గడ్డపై వైకాపాకి మరో షాక్.. టీడిపీలోకి 200 కుటుంబాలు.. విజయనగరంలో మారిన రాజకీయం!
విజయనగరం(Vizianagaram Politics) జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 200 కుటుంబాలు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
Vizianagaram botsa satyanarayana stronghold ycp leaders join tdp
Vizianagaram Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన కోటగా ఉంది. అయితే, వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గంలో ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అక్కడ వైకాపా ప్రాబల్యం వేగంగా బలహీనపడుతుండగా, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
తెదేపాలోకి భారీగా చేరికలు.. 200 కుటుంబాల కీలక నిర్ణయం:
ఈ క్రమంలో కుమురం, పోలయ్యవలస, జమ్ము, సదానందపురం, చోడవరం(Vizianagaram Politics) తదితర గ్రామాల నుంచి సుమారు 200 కుటుంబాలు వైకాపాకు గుడ్‌బై చెప్పి షాక్ ఇచ్చాయి. ఇప్పటికే మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీని వీడగా, తాజాగా వందలాది మంది నాయకులు రాజీనామా చేసి, తెదేపా నేత కళా వెంకట్రావు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
