Sai Pallavi : ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వస్తున్న సాయి పల్లవి..
ఈ నేచురల్ బ్యూటీ 2026 లో బాలీవుడ్ డెబ్యూ మాత్రం బాగా డిజప్పాయింట్ చేసింది. (Sai Pallavi)
Sai Pallavi
Sai Pallavi : 2025 లో తండేల్ సినిమాతో ప్రేక్షకులని పలకరించి హిట్ కొట్టింది సాయి పల్లవి. ఆ సినిమా తర్వాత సౌత్ ప్రేక్షకులను అయితే పలకరించలేదు. కానీ ఈ నేచురల్ బ్యూటీ 2026 లో బాలీవుడ్ డెబ్యూ మాత్రం బాగా డిజప్పాయింట్ చేసింది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఏక్ దిన్.. సినిమా టైటిల్‌కి తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర ఒక్క రోజు హంగామా గానే మిగిలిపోయింది.
అయితే సాయి పల్లవి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వస్తుంది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో నితేశ్ తివారీ తెరకెక్కించిన విజువల్ గ్రాండియర్ సినిమా రామాయణ. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్.. ఇలా భారీ స్టార్‌కాస్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ దీపావళి కానుకగా ఆడియెన్స్ ముందుకొస్తుంది. నవంబర్ 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం స్పీడప్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సీతగా నటిస్తున్న సాయిపల్లవి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుదోననే ఎగ్జైట్మెంట్ అభిమానుల్లో కనిపిస్తుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సీతగా సాయిపల్లవి అప్పీరియెన్స్ సైతం అందర్నీ ఇంప్రెస్ చేస్తోంది.
Also Read : Varsha Dsouza : టెన్నిస్ కోర్టులో వర్ష డిసౌజా వయ్యారాలు.. షార్ట్ స్కర్ట్‌లో..
రామాయణ మొదటి భాగంతో పాటు.. సాయిపల్లవి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ధనుష్ ‘ఓం’ కూడా నవంబర్లోనే థియేటర్స్‌లోకి వస్తుంది. ధనుశ్ హీరోగా డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నవంబర్ 20న రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్గా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్‌గా సాయిపల్లవి క్యారెక్టర్ ప్లే చేస్తుండటంతో అంచనాలు సైతం అదే స్థాయిలో ఉన్నాయి. ఇదే ఓం సినిమాలో హీరోయిన్ శ్రీలీల కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మరి నవంబర్‌లో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో రాబోతున్న సాయి పల్లవి హిట్స్ కొడుతుందా చూడాలి.
