Bigg Boss Elimination : ఈ వారం ‘సృష్టి’ ఎలిమినేట్.. స్టార్ ప్లేయర్ ఎవరంటే.. బిగ్ బాస్ 10 డే 28 వీకెండ్ ఎపిసోడ్..
మొత్తానికి ఈ వారం చరణ్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే అనుకోకుండా సృష్టి ఎలిమినేట్ అయింది. (Bigg Boss Elimination)
Bigg Boss Elimination
Bigg Boss Elimination : నిన్న నాగార్జున అందరి మీద ఫైర్ అయి రోహిత్, అమన్, త్రిగున్ లకు ఎల్లో కార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆదివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి మొదట నామినేషన్స్ ఉన్న వాళ్ళని పిలిచి ఓ టాస్క్ తో ముకేశ్, దేబ్జానీ సేఫ్ అయినట్టు చెప్పారు. బాయ్స్, గర్ల్స్ ని డివైడ్ చేసి సన్ డే ఫన్ డే గేమ్ పెట్టారు. ఒక నటి, లేదా నటుడు వాళ్ళు మూవీ లో చేసిన వృత్తి ఫోటో చూపిస్తారు. ఆ మూవీ పేరు చెప్పాలి. గేమ్ ఆడిస్తూ డ్యాన్స్ వేయించారు.
నెక్స్ట్ మళ్ళీ నామినేషన్స్ లో ఉన్నవాళ్లను పిలిచారు. నరేష్ సేవ్ అని ప్రకటించారు. అనంతరం ఒక ప్రమోషనల్ సిగ్మెంట్ నిర్వహించారు. మళ్ళీ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళను పిలిచారు. చరణ్, త్రిగున్ సేవ్ అయ్యారు ఈసారి. మళ్ళీ ఒక గేమ్ నిర్వహించారు. ఇద్దరు బాయ్స్ – ఇద్దరు గర్ల్స్ ని పిలిచి ఒక ప్రశ్న అడిగితే అందరూ సమాధానం చెప్పాలి. నాగార్జున దగ్గర ఉన్న సమాధానంకి ఎవరిదీ మ్యాచ్ అయితే వాళ్లకు చాక్లెట్స్ ఇస్తానని ప్రకటించారు.
సుధీర్, వంశీ – ఝాన్సీ, దేబ్జానీ ఆడగా దేబ్జానీ, వంశీ చాక్లెట్ గెలిచారు. త్రిగున్, నరేష్ – సృష్టి, వర్షిణి ఆడగా నరేష్, వర్షిణి చాక్లెట్ గెలిచారు. రామ్ ప్రసాద్, చరణ్ – అపూర్వ, షాలిని ఆడగా షాలిని చాక్లెట్ గెలిచింది. అమన్, ముకేశ్ – ఝాన్సీ, సృష్టి ఆడగా ముకేశ్ చాక్లెట్ గెలిచాడు. దేబ్జానీ, అపూర్వ – రోహిత్, త్రిగున్ ఆడగా త్రిగున్ చాక్లెట్ గెలిచాడు. వంశీ, చరణ్ – షాలిని, ఝాన్సీ ఆడగా చరణ్ చాక్లెట్ గెలిచాడు. సుధీర్, రామ్ ప్రసాద్ – సృష్టి, వర్షిణి ఆడగా రామ్ ప్రసాద్ చాక్లెట్ గెలిచాడు.
Also See : Rashmika Mandanna : తమిళనాడు ఆలయంలో రష్మిక మందన్న.. చీరలో సాంప్రదాయంగా ఫొటోలు..
అనంతరం ఈ వారం స్టార్ ప్లేయర్ ఎవరికి అని దిగారు. దేబ్జానీ.. వంశీ పేరు చెప్పింది. ఝాన్సీ.. సుధీర్ పేరు చెప్పింది. అపూర్వ.. ఝాన్సీ పేరు, షాలిని.. సృష్టి పేరు, సృష్టి.. త్రిగున్, త్రిగున్.. వంశీ పేరు, సుధీర్.. ఝాన్సీ పేరు, ముకేశ్.. ఝాన్సీ పేరు, నరేష్.. వంశీ పేరు, రోహిత్.. సృష్టి పేరు, అమన్.. సృష్టి పేరు, చరణ్.. సృష్టి పేరు, వంశీ.. సుధీర్ పేరు, రామ్ ప్రసాద్.. ఝాన్సీ పేరు, వర్షిణి.. వంశీ పేరు చెప్పారు. వంశీ, ఝాన్సీ, సృష్టిలకు సమానంగా నాలుగు ఓట్స్ వచ్చాయి. దాంతో మళ్ళీ ఓటింగ్ పెట్టారు. ఝాన్సీ విన్ అయి ఈ వారం స్టార్ ప్లేయర్ అయింది.
అనంతరం హౌస్ లో ఉన్న 15 మందిని ముగ్గురు ముగ్గురు గ్రూప్స్ గా విడిపోవాలి. ఆ ముగ్గురులో ఒకరు కెప్టెన్ గా ఉండాలి అని చెప్పారు నాగార్జున. ఆ ముగ్గుర్ని ఒక పడవలో నిల్చోబెట్టి కెప్టెన్ ని మిగతా ఇద్దరిలో ఎవరిని ముంచుతావు, ఎవరిని సేవ్ చేస్తావు అనే టాస్క్ చెప్పించారు. ముంచేవాళ్ళని ఎందుకు ముంచుతున్నారో కెప్టెన్ కారణం చెప్పమన్నారు.
మొదట ముకేశ్, వర్షిణి, సుధీర్ గ్రూప్ రాగా ముకేశ్ కెప్టెన్ అవడంతో వర్షిణిని సేవ్ చేస్తాను, సుధీర్ ముంచుతాను అని చెప్పమన్నారు. నరేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ గ్రూప్ రాగా నరేష్ కెప్టెన్ అవ్వడంతో రామ్ ప్రసాద్ ని ముంచుతాను, దేబ్జానీ ని సేవ్ చేస్తాను అని చెప్పాడు. అమన్, అపూర్వ, చరణ్ గ్రూప్ రాగా అమన్ కెప్టెన్ కావడంతో అపూర్వని ముంచేసి చరణ్ ని సేవ్ చేస్తానని చెప్పాడు. అయితే ఇందులో అమన్, చరణ్ ని పంపించేసి రోహిత్, షాలిని లని పిలిచాడు నాగ్. రోహిత్, షాలిని, అపూర్వ ట్రయాంగిల్ ట్రాక్ నడుస్తుంది. షాలిని అపూర్వ వల్ల జెలస్ ఫీల్ అవుతుందని తెలిసిందే. అందుకే నాగ్ కూడా ఇలా పిలిచి రోహిత్ ని అడిగారు. దాంతో రోహిత్ ఊహించినట్టే అపూర్వ ని ముంచుతాను, షాలిని సేవ్ చేస్తాను అని చెప్పాడు. నెక్స్ట్ ఝాన్సీ, షాలిని, రోహిత్ గ్రూప్ రాగా షాలిని కెప్టెన్ కావడంతో ఊహించినట్టే ఝాన్సీ ని ముంచుతాను, రోహిత్ సేవ్ చేస్తాను అని చెప్పింది. త్రిగున్, సృష్టి,వంశీ గ్రూప్ రాగా సృష్టి కెప్టెన్ కావడంతో వంశీని ముంచేసి, త్రిగున్ ని సేవ్ చేస్తాను అని తెలిపింది.
Also Read : Sai Pallavi : ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వస్తున్న సాయి పల్లవి..
మళ్ళీ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని పిలిచారు. రోహిత్, అమన్ సేవ్ అయ్యారు. అనంతరం స్టార్ ప్లేయర్ కావడంతో ఝాన్సీ కి గిఫ్ట్ పంపించారు. అలాగే తన ఫేవరేట్ కంటెస్టెంట్ లో ఒకరికి గిఫ్ట్ ఇస్తాము అని చెప్పడంతో ముకేశ్ కి ఇచ్చింది ఝాన్సీ. ఫైనల్ గా నామినేషన్స్ లో ఉన్న షాలిని – సృష్టి లని పిలిచారు. ఓ టాస్క్ తో సృష్టి ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు. దీంతో షాలిని ఎమోషనల్ అయినట్టు నటించింది ఎప్పట్లాగే. ఇక అందరూ సృష్టికి బాయ్ చెప్పారు. సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఎమోషనల్ అయ్యారు కొంతమంది. సృష్టి స్టేజిపైకి వచ్చి మాట్లాడింది. సృష్టిని హౌస్ లో ఇంకా మాస్క్ వేసుకొని ఎవరు ఆడుతున్నారు పేర్లని చెప్పామన్నారు నాగార్జున. ముకేశ్, రామ్ ప్రసాద్, వర్షిణి పేర్లని చెప్పింది సృష్టి.
ఈ మధ్యలో చరణ్ మాట్లాడటంతో నాగార్జున చరణ్ పై సెటైర్లు వేశారు. వారానికోసారి బయటకు వెళ్తున్నావు వస్తున్నావు నువ్వు ఆడేదేముంది అని ఉన్న మాట చెప్పారు నాగ్. మొత్తానికి ఈ వారం చరణ్ ఎలిమినేట్ అవుతాడు అనుకుంటే అనుకోకుండా సృష్టి ఎలిమినేట్ అయింది. మొన్న వారం టోటల్ డామినేషన్ థీమ్ నడవగా రాబోయే వారం థీమ్ రోడ్ టు రీలోడ్ ఉండబోతుందని ప్రకటించాడు బిగ్ బాస్. ఇక రేపు సోమవారం నామినేషన్స్ ఉండబోతున్నాయి.
