Apple AirPods : వావ్.. ఇక కెమెరాతో ఆపిల్ ఎయిర్‌పాడ్స్.. సెప్టెంబర్‌లోనే సర్ప్రైజ్ ఎంట్రీ?
Apple AirPods : కొత్త రిపోర్టు ప్రకారం.. ఆపిల్ కెమెరాతో ఎయిర్‌పాడ్స్ రాబోతున్నాయి. గతంలో ఊహించిన దానికన్నా ముందుగా సెప్టెంబర్ నెలలోనే లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలివే..
Apple AirPods
- అతి త్వరలో కెమెరాతో ఎయిర్ ప్యాడ్స్ లాంచ్
- వచ్చే సెప్టెంబర్‌లోనే కెమెరా ఎయిర్ పాడ్స్ రిలీజ్
- ఎయిర్‌పాడ్స్‌లో ఆపిల్ ‘విజువల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్
Apple AirPods : ఆపిల్ ఐప్యాడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో కెమెరాతో ఎయిర్ ప్యాడ్స్ రాబోతున్నాయి. సరికొత్త టెక్నాలజీతో మరోసారి మార్కెట్‌ను షేక్ చేసేందుకు టెక్ దిగ్గజం ఆపిల్ రెడీ అవుతున్నట్టు లేటెస్ట్ రిపోర్టులు సూచిస్తున్నాయి.
కెమెరాతో ఎయిర్‌పాడ్స్‌ను గత అంచనాల కన్నా ముందుగానే తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే లాంచ్ చేసేందుకు ఆపిల్ రెడీ అవుతుందని సమాచారం. ఇప్పటివరకు ఈ ప్రొడక్టు 2027లో వస్తుందని భావించగా ప్రస్తుతం లీక్ డేటా యూజర్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది.
డెవలప్ స్టేజీలో మరో వెర్షన్ :
బ్లూమ్‌బెర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్మాన్ ప్రకారం.. ఆపిల్ 2 వేర్వేరు వెర్షన్లపై వర్క్ చేస్తోంది. B798 కోడ్‌నేమ్‌తో అడ్వాన్స్ మోడల్ 2027కు వాయిదా పడింది. B790 అనే మరో వెర్షన్ డెవలప్ స్టేజీలో ఉందని తెలుస్తోంది. ఈ మోడల్‌కు సంబంధించిన కోడ్ ఇప్పటికే iOS 27లో కనిపించింది.
Read Also : JioTag 2 : మీ పర్సు, తాళాలు, లగేజీ పోయాయా? ఇక టెన్షన్ వద్దు.. JioTag 2తో ఈజీగా కనిపెట్టొచ్చు!
అయితే, B790 నిజంగా కెమెరాతో ఎయిర్పాడ్స్నా? లేదా సాధారణ ఎయిర్ ప్యాడ్స్ ప్రో హార్డ్‌వేర్ అప్డేట్ మాత్రమేనా? అనేదానిపై క్లారిటీ లేదు. కానీ iOS కోడ్‌లో యూజర్లకు తలకు ఇరువైపులా ఉన్న కెమెరాలతో ఫొటోలను కలెక్ట్ చేయడం వంటి వివరాలు ఉన్నాయి. దీనిబట్టి చూస్తే.. కెమెరా ఎయిర్‌పాడ్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది.
విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ :
ఈ ఎయిర్‌పాడ్స్‌లో ఆపిల్ ‘విజువల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే, ఎయిర్‌పాడ్స్ కెమెరా ద్వారా కనిపించే వస్తువులు, పురాణా కట్టడాలు, టెక్స్ట్‌ను గుర్తించి యూజర్లకు సమాచారం అందించగలదు. ఉదాహరణకు.. కిరాణా సరుకులను చూపిస్తే.. వాటితో చేయగల వంటకాలను కూడా సూచించగలదని నివేదికలు చెబుతున్నాయి.
డిజైన్ పరంగా చూస్తే భారీగా మార్పులు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ కోసం ప్రస్తుత ఎయిర్ ప్యాడ్స్ ప్రో కన్నా లాంగ్ స్టెమ్, డేటా క్లౌడ్‌కు సెండ్ చేసేందుకు LED లైటింగ్ ప్రైవసీ ఇండికేషన్ వంటి కొత్త ఫీచర్లు ఉండవచ్చు.
అయితే, ప్రస్తుతం ఈ వివరాలన్నీ లీకులు, ఇతర సమాచారం ఆధారంగానే చెప్పవచ్చు. ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ తర్వాతే కెమెరా ఎయిర్‌పాడ్స్ నిజంగా సెప్టెంబర్‌లో వస్తాయా? లేదా మళ్లీ వాయిదా పడతాయా? అనేది క్లారిటీ వస్తుంది.
