Flipkart Freedom Sale : కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ గెలాక్సీ S25పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..
Samsung Galaxy S25 : శాంసంగ్ లవర్స్ కోసం మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ భారీ తగ్గింపుతో లభించనుంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ భారీ తగ్గింపుతో లభించనుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే కొన్ని డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

తక్కువ ధరకే కొత్త ఫోన్లను కొనాలని చూసేవారికి అద్భుతమైన ఛాన్స్.. రూ. 60వేల లోపు ఫ్లాగ్షిప్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలి? సేల్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 తేదీ :
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 ఆగష్టు 8, 2026న ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లు, ప్లస్ మెంబర్లు, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుదారుల కోసం ఆగష్టు 7వ తేదీనే ఈ సేల్కు ముందస్తు యాక్సెస్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ :
శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ (12GB + 128GB) ధర రూ. 74,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 15వేల ధర తగ్గింపుతో లభ్యం కానుంది. ధర రూ. 59,999కి తగ్గుతుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S25లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్ప్లే ఉంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ శాంసంగ్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,000mAh బ్యాటరీతో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25లో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ కొనాలా వద్దా? :
శాంసంగ్ గెలాక్సీ S25 అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు. 6.2-అంగుళాల డిస్ప్లేతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో రన్ అవుతుంది. కెమెరా, లాంగ్ సాఫ్ట్వేర్ సపోర్టు అందిస్తుంది.

అయితే, ఈ శాంసంగ్ ఫోన్లో 4,000mAh బ్యాటరీ ఒక్కటే తక్కువ.. ఇతర ఫోన్లల కన్నా చాలా చిన్నది. మీరు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, కాంపాక్ట్ డిజైన్, మంచి కెమెరాలు సాఫ్ట్వేర్ సపోర్ట్ వంటి ఫీచర్ల కోసం చూస్తుంటే తక్కువ ధరలో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ కొనేసుకోవడమే బెటర్.
