Flipkart Freedom Sale : కొంటే శాంసంగ్ ఫోన్ కొనాలి.. ఈ గెలాక్సీ S25పై ఖతర్నాక్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ధర జస్ట్..

Samsung Galaxy S25 : శాంసంగ్ లవర్స్ కోసం మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ భారీ తగ్గింపుతో లభించనుంది. ఈ అదిరిపోయే డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

1/8
Samsung Galaxy S25 : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ భారీ తగ్గింపుతో లభించనుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే కొన్ని డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.
2/8
తక్కువ ధరకే కొత్త ఫోన్‌లను కొనాలని చూసేవారికి అద్భుతమైన ఛాన్స్.. రూ. 60వేల లోపు ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలి? సేల్ పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
3/8
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 తేదీ : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ డే సేల్ 2026 ఆగష్టు 8, 2026న ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ మెంబర్లు, ప్లస్ మెంబర్లు, ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుదారుల కోసం ఆగష్టు 7వ తేదీనే ఈ సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.
4/8
శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ : శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ (12GB + 128GB) ధర రూ. 74,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రూ. 15వేల ధర తగ్గింపుతో లభ్యం కానుంది. ధర రూ. 59,999కి తగ్గుతుంది.
5/8
స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ శాంసంగ్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,000mAh బ్యాటరీతో వస్తుంది.
6/8
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S25లో ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా ఉంది.
7/8
ఈ ఫోన్ కొనాలా వద్దా? : శాంసంగ్ గెలాక్సీ S25 అద్భుతమైన డీల్ అని చెప్పొచ్చు. 6.2-అంగుళాల డిస్‌ప్లేతో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో రన్ అవుతుంది. కెమెరా, లాంగ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు అందిస్తుంది.
8/8
అయితే, ఈ శాంసంగ్ ఫోన్‌లో 4,000mAh బ్యాటరీ ఒక్కటే తక్కువ.. ఇతర ఫోన్లల కన్నా చాలా చిన్నది. మీరు ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, కాంపాక్ట్ డిజైన్, మంచి కెమెరాలు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ వంటి ఫీచర్ల కోసం చూస్తుంటే తక్కువ ధరలో ఈ శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ కొనేసుకోవడమే బెటర్.