MLA Assets : వందల కోట్ల అప్పులు.. వారం రోజుల్లో క్లియర్! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేపై హాట్ డిస్కషన్! ఎలా వచ్చాయి?
MLA Assets : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అప్పులు, ఆస్తులు, అవస్థల ట్రాక్ రికార్డు ఇప్పుడు ఆసక్తికరంగా.. అంతకు మించి చర్చనీయాంశంగా మారింది.
MLA Loan Settlement
MLA Assets : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అప్పులు, ఆస్తులు, అవస్థల ట్రాక్ రికార్డు ఇప్పుడు ఆసక్తికరంగా.. అంతకు మించి చర్చనీయాంశంగా మారింది. గతంలో ఆయన తీవ్ర అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడమే కాదు.. బ్యాంకులు ఆయన్ను డీఫాల్టర్‌గా ప్రకటించాయట. ఇక మార్గమే లేదు. అంతా ఢమాల్. ఆయన కథ ముసిగిందనుకునే లోపే.. 2023లో ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారట. ఆ తర్వాత ఏడాదిన్నరలోనే సారు గారి ఆర్థిక పరిస్థితి మొత్తం మారిపోయిందట.
Also Read : Big Shock To BJP Party : మూడింట రెండు ఓడిపోయిన బీజేపీ.. అధికారంలో ఉండికూడా..! ఇది జెన్‌జీ ఎఫెక్టా?
లోబడ్జెట్ నుంచి సర్ ప్లస్‌కు వచ్చేశారట. ఏకంగా గతంలో చేసిన రూ.వందల కోట్ల రూపాయల అప్పును వన్ వీక్‌లో క్లియర్ చేశారట. అలా అని ఆయన అప్పులు చేబదుల్లు.. ప్రైవేటు లోన్లు కాదట. బ్యాంకుల దగ్గర అఫీషియల్ తీసుకున్న లోన్లను ఒక్క వారంలోనే.. వన్ టైమ్ సెటిల్మెంట్ చేసి ఎన్వోసీ కూడా పొందారట.
25ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న సదరు నేతకు బిజినెస్‌మెన్‌గా పేరుంది. తన కుటుంబ సభ్యులు గతంలో వివిధ బిజినెస్‌లల్లో పార్ట్నర్లుగా ఉన్నారట. అలా కొన్ని వ్యాపార సంస్థలు తీసుకున్న లోన్లకు సెక్యూరిటీ ఇచ్చారట. ఆ నేత, ఆయన ఫ్యామిలీ వాటాదారులుగా ఉన్న సంస్థలు ఆరేళ్ల కాలంలో వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.400 కోట్ల రుణాలు తీసుకున్నాయంటున్నారు. ఏళ్ల తరబడి వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో బ్యాంకులు మొండి బకాయిదారులుగా ప్రకటించాయట. ఇదంతా 2024 వరకే.! ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏడాదిన్నరలోపే పరిస్థితి మారిపోయిందని చర్చ జరుగుతోంది.
కేవలం వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకుల్లో ఏళ్ల తరబడి భారీగా పేరుకు పోయిన బకాయిలను.. రూ.400 కోట్లకు పైగా సదరు సంస్థలు తీర్చేయడం వ్యాపార, రాజకీయ వర్గాలను షాకింగ్ గురి చేసిందట. ఇదెలా సాధ్యమయ్యింది?, ఏం జరిగిందనే చర్చకు తెరలేపిందట.
అప్పుల ఊబిలో కూరుకుపోయి.. డీఫాల్టర్లుగా మారిన సదరు నేత వరుస ఓటముల తర్వాత 2023 ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఏడాదిన్నరలోపే..రూ.వందల కోట్ల లోన్లను వారం రోజుల్లో బ్యాంకులకు తిరిగి చెల్లించడం హాట్ టాపిక్ అవుతోంది. ఓ బ్యాంకుకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.120 కోట్లు చెల్లించేశారట. తమకు బకాయి పడిన మొత్తం తిరిగి వసూలైందని సదరు బ్యాంకు ఎన్ఓసీ కూడా జారీ చేసిందని అంటున్నారు.
అయితే వందల కోట్లు అప్పులు క్లియర్ చేసిన సదరు నేత.. 2023 ఎన్నికల అఫిడవిట్లు మాత్రం.. ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా ఉన్నాయట. తనతో పాటు తన భార్య వృత్తిని వ్యాపారంగా చెప్పిన ఆయన.. ఆస్తుల విలువ కేవలం వందకోట్లలోపే చూపించారట. ఆయనకు విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని.. ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరచలేదని ఆరోపణలు ఉన్నాయట. అయితే గతమంతా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడి.. ఒకేసారి వందల కోట్ల రుణాలను ఎలా చెల్లించారని ఆరా తీస్తే అనేక ఇంట్రస్టింగగక్ విషయాలు వెలుగుచూస్తున్నాయట.
షార్ట్ టర్మ్‌లో రూ.వందల కోట్లు ఎలా పోగుచేశారు.? గతంలో చేసిన అప్పులన్నీ తీర్చడానికి ఇన్కమ్ సోర్సేంటి.? లేక మరేదైనా మార్గంలో ఆయనకు డబ్బులు వచ్చాయా అనేది పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. రూ.400 కోట్లకు పైగా లోన్ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై సదరు ఎమ్మెల్యే నోరువిప్పితే గానీ అసలు వాస్తవాలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.
