Bigg Boss Nominations : నామినేషన్స్ ఫైర్.. మారని చరణ్.. టార్గెట్ త్రిగున్.. ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారు?బిగ్ బాస్ 10 డే 23 ఎపిసోడ్..
సప్త శక్తి టీమ్ ఓడిపోవడంతో అందరూ నామినేట్ అయ్యారు. (Bigg Boss Nominations)
Bigg Boss Nominations
Bigg Boss Nominations : నిన్న రథం టాస్క్ ఇచ్చి రెండు టీమ్స్ కి బార్లు కలెక్క్ట్ చేసే టాస్క్ ఇవ్వగా మొదటి రౌండ్ లో భైరవ టీమ్ 32 బార్లు, సప్త శక్తి టీమ్ 19 బార్లు గెలుచుకున్నారు. ఇక నిన్నంతా షాలిని ఓవర్ యాక్షన్ తో అపూర్వ తో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. భైరవ టీమ్ వాళ్ళని ఎవరి వల్ల గెలిచారో మీ టీమ్ లో పేరు చెప్పండి అని బిగ్ బాస్ అడగడంతో వంశీ పేరు చెప్పారు. రెండో రౌండ్ కి సృష్టి, అమన్ సంచలాక్ గా ఉన్నారు. రెండో రౌండ్ లో కూడా రెండు టీమ్స్ గొడవ పది, లాక్కొని గేమ్ ఆడారు. ఈ గేమ్ లో ఝాన్సీ ఏడ్చింది. రెండో రౌండ్ లో భైరవ టీమ్ దగ్గర 51, సప్త శక్తి 20 బార్లు ఉన్నాయి. విన్నర్ భైరవ టీమ్ అవ్వడంతో రథాన్ని అమర్చే ఛాన్స్ ఇచ్చారు. ఈసారి సుధీర్ వల్ల గెలిచామని చెప్పారు. ఫైనల్ గా భైరవ టీమ్ గెలిచారు. రథాన్ని అమర్చారు. వీళ్ళ టీమ్ కి నా మద్దతు ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు.
భైరవ టీమ్ గెలవడంతో వంశీ, సుధీర్ లకు వేరే టీమ్స్ వాళ్లలో ఎవరివైనా రెండు కత్తులు తీసుకోమన్నారు. వంశీ – ముకేశ్, సుధీర్ – త్రిగుణ కత్తులు తీసుకున్నారు. అనంతరం సుధీర్ వెళ్లి కెప్టెన్ అపూర్వ రూమ్ లో ఉన్న సోఫా లో కూర్చోవడంతో ముకేశ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో రోహిత్ – త్రిగున్ గొడవ పడ్డారు. కెప్టెన్ రూమ్ లోకి మళ్ళీ వర్షిణి వెళ్లడంతో ముకేశ్ – అపూర్వ గొడవ పడ్డారు.
ఇక నామినేషన్స్ దగ్గరికి రావడంతో భైరవ టీమ్ గెలవడంతో వాళ్ళకే నామినేషన్ చేసే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. సప్త శక్తి టీమ్ ఓడిపోవడంతో అందరూ నామినేట్ అయ్యారు. వాళ్లలో కేవలం ఇద్దరికి మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ ఇద్దరూ ఎవరు అనేది వాళ్ళ టీమ్ డిసైడ్ చేసుకోవాలి అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో నరేష్, త్రిగున్ లకు ఛాన్స్ వచ్చింది. ఎవర్ని నామినేట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఫేస్ మీద ఫోమ్ స్ప్రే చేయాలి. టెంప్టేషన్ టాస్క్ వల్ల ఆల్రెడీ ముకేశ్ నామినేట్ అయ్యాడు. అపూర్వ కెప్టెన్ కాబట్టి ఆమెని కూడా నామినేట్ చేయకూడదు.
మొదట త్రిగున్ – రోహిత్ చేసే పనులని, రోహిత్ మ్యానిప్యులేట్ చేసే విధానాన్ని, రోహిత్ చేసే తన అగ్నిపరీక్ష గ్రూపిజం చెప్పి నామినేట్ చేసాడు. అలాగే రోహిత్ పనులు చేయకపోవడం, అతని బద్ధకం గురించి చెప్పి నామినేట్ చేసాడు. ఇక రోహిత్ కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
నరేష్ – అమన్ ని నామినేట్ చేసాడు. అమన్ ప్రతిదానికి గొడవ పడుతాగున్నాడు. అతనితో ఏమన్నా మాట్లాడాలి అంటే గొడవ అవుతుందేమో అనిపిస్తుంది. ప్రతి దానికి ట్రిగ్గర్ అయిపోతున్నాడు. సంచాలక్ గా సరిగ్గా చేయలేదు, వర్క్ విషయంలో బద్ధకం అని చెప్పి నామినేట్ చేసాడు.
తర్వాత భైరవ టీమ్ అంతా చేసారు నామినేషన్స్. ఝాన్సీ – సృష్టి ని నామినేట్ చేసింది. ఓ టాస్క్ లో నన్ను నామినేట్ చేయకు అని అడుక్కుంది. అంత వీక్, భయం వెళ్లిపోతుందేమో అని అందుకే నామినేట్ చేసానని చెప్పింది. అమన్ – త్రిగున్ ని నామినేట్ చేసాడు. మిథిలేష్ విషయంలో అయిన గొడవకు, అమన్ పనిచేయకపోతే త్రిగున్ అన్న మాటలకు నామినేట్ చేసాడు. అపూర్వ – త్రిగున్ ని నామినేట్ చేసింది. మీరు చాలా ఇరిటేటింగ్ పర్సన్ అని, ఓవర్ యాక్షన్ చేసుకుంటూ త్రిగున్ ని నానా మాటలు అని నామినేట్ చేసింది.
రామ్ ప్రసాద్ – షాలిని ని నామినేట్ చేసాడు. బిగ్ బాస్ ఎన్ని సార్లు చెప్పినా అదే లేట్ అవ్వడం అని, నిన్న జరిగిన గొడవ గురించి చెప్పి నామినేట్ చేసాడు. రామ్ ప్రసాద్ కూల్ గా మాట్లాడుతుంటే షాలిని ఎప్పట్లాగే ఓవర్ యాక్షన్ చేస్తూ అరుస్తూ మాట్లాడింది.
Also Read : NTR Speech : ఆ రోజు మా అమ్మానాన్న లేరు.. చేతికి సర్జరీ.. బాధ పడ్డాను.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..
రోహిత్ – దేబ్జానీని నామినేషన్ చేసాడు. తన గేమ్ నాకు ఎప్పుడూ కనపడలేదు. అసలు ఆమెకు నామినేషన్స్ అంటే కూడా తెలిదేసు. ఆమె క్వీన్ విక్టోరియా అని ఫిల్ అవుతారు. మీరొక ఫ్లిప్పర్ అని చెప్తూ నామినేట్ చేయడంతో దేబ్జానీ – రోహిత్ మధ్య గొడవ అయింది. నరేష్ పాయింట్ తీసుకొచ్చి దేబ్జానీ పై ఫైర్ అవ్వడంతో నరేష్ దేబ్జానికి సపోర్ట్ గా మాట్లాడాడు. దాంతో రోహిత్ ఏం చేయలేకపోయాడు. వర్షిణి – సృష్టిని నామినేట్ చేసింది. గత వారం సుధీర్ గొడవ విషయంలో. వంశీ – చరణ్ ని నామినేట్ చేసాడు. రెండో సారి వచ్చినా ఏమి ఆడట్లేదు. గేమ్స్ ఆడట్లేదు. నీకు అవకాశాలు వచ్చినా ప్రూవ్ చేసుకోవట్లేదు, ఇండివిడ్యువల్ గా ఆడు అని చెప్తే. కానీ చరణ్ నా ఇష్టం అంటూ ఓవర్ యాక్షన్ చేసాడు. సుధీర్ కూడా చరణ్ నే నామినేట్ చేసాడు. లాస్ట్ వీక్ గేమ్ లో చరణ్ చేసింది నాగార్జున, బిగ్ బాస్ లు తప్పు అని చెప్పినా చరణ్ ఇంకా నేను కరెక్ట్ అని చెప్తూ నాగార్జున, బిగ్ బాస్ లనే తప్పు అన్నాడు. ఎంత చెప్పినా వినకుండా నేనే కరెక్ట్ అని ఓవర్ యక్ష చేసాడు కాసేపు.
మొత్తంగా ఈ వారం ముకేశ్, త్రిగున్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టిలు నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వీకెండ్ వీళ్ళలో ఎవరు వెళ్ళిపోతారో చూడాలి.
