Nara Lokesh : జగపతి బాబు షోకి నారా లోకేష్.. బాలయ్య బాబు డైలాగ్ చెప్పి.. ప్రోమో వైరల్..
మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి.. (Nara Lokesh)
Nara Lokesh
Nara Lokesh : జగపతి బాబు హోస్ట్ గా జీ తెలుగులో జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రెండో సీజన్ కూడా మొదలయింది. తాజాగా ఈ షోకి ఏపీ మంత్రి నారా లోకేష్ గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసారు.
ఈ ప్రోమోలో.. నారా లోకేష్ జై బాలయ్య అంటూ మొదలుపెట్టారు. స్కూల్ లో ఎక్కువగా కొట్టింది నన్నే అంటూ చిన్నప్పటి విషయాలు పంచుకున్నారు. బాలయ్య బాబు గారు ఒకే ఒక్కరికి భయపడతారు అని సీక్రెట్స్ చెప్పారు. చివర్లో ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని బాలయ్య డైలాగ్ చెప్పి అదరగొట్టారు. దీంతో ఈ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ ఎపిసోడ్ లో నారా లోకేష్ ఇంకేం మాట్లాడతారో అని ఫ్యాన్స్, కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.
Also Read : Rayavalasa : మా ఊరు రాయవలస సాంగ్ విన్నారా? విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్..
జయమ్ము నిశ్చయమ్మురా షో నారా లోకేష్ ఎపిసోడ్ జీ5 ఓటీటీలో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. జీ తెలుగు ఛానల్ లో నవంబర్ 8న రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..
