iPhone 18e Leak : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఐఫోన్ 18, ఐఫోన్ 18e వస్తున్నాయ్.. ఫీచర్లు, ధర వివరాలు లీక్..!
iPhone 18- iPhone 18e Leak : ఆపిల్ ఐఫోన్ 18, ఐఫోన్ 18ఇ ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి. 2027 లాంచ్ తేదీ, A20 చిప్, 48MP కెమెరా, బ్యాటరీ, భారత్ ధరలపై అంచనాలివే..
iPhone 18, iPhone 18e Leak
iPhone 18e Leak : ఆపిల్ అభిమానులకు ఈసారి కంపెనీ అదిరే సర్ప్రైజ్ ఇచ్చింది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను లాంచ్ చేసిన సమయంలో సాధారణ iPhone 18 మోడల్‌ను మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే, వచ్చే ఏడాది ప్రారంభంలో ఐఫోన్ 18, బడ్జెట్ ధరలో ఐఫోన్ 18e మోడళ్లను తీసుకొచ్చేందుకు ఆపిల్ రెడీ అవుతున్నట్టు లీకులు సూచిస్తున్నాయి..
లేటెస్ట్ డేటా ప్రకారం.. 2027 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఈ కొత్త ఐఫోన్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో లాంచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఐఫోన్ 18 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవేనా? :
లీకుల ప్రకారం.. ఐఫోన్ 18లో 6.3 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉండొచ్చు. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ అందించే ఛాన్స్ ఉంది. డైనమిక్ ఐలాండ్ డిజైన్ కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఫోన్లో 4,430mAh బ్యాటరీ ఉండొచ్చు. ఐఫోన్ 17లోని 3,692mAh బ్యాటరీతో పోలిస్తే దాదాపు 20 శాతం ఎక్కువ. A20 చిప్సెట్, 9GB లేదా 12GB ర్యామ్, C2 మోడెమ్ ఉండవచ్చని అంచనా.
Read Also : iPhone 17 Offers : కొత్త ఐఫోన్ 17 కొంటున్నారా? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కడ చీప్‌గా దొరుకుతుందో తెలుసా?
కెమెరాల విషయానికి వస్తే..
బ్యాక్ సైడ్ రెండు 48MP సెన్సార్లు ఉండొచ్చు. స్టోరేజ్ 256GB, 512GB ఆప్షన్లలో రావచ్చు.. మరోవైపు ఐఫోన్ 18eలో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ స్క్రీన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. A20 చిప్, 8GB లేదా 9GB ర్యామ్, 4,430mAh బ్యాటరీ అందించవచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇందులో బ్యాక్ సైడ్ 48MP సింగిల్ కెమెరా, ఫ్రంట్ 24MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చు.
ఐఫోన్18 భారత్ ధర? :
భారత్‌లో ఐఫోన్18 ప్రారంభ ధర రూ.99,900గా ఉండొచ్చని అంచనా. ఇక ఐఫోన్ 18e ధర రూ.79,900 నుంచి ప్రారంభం కావచ్చని అంచనా. అలాగే ఐఫోన్ ఎయిర్ 2 ధర సుమారు రూ.1,49,900 ఉండొచ్చని టాక్.. అయితే, ఇవన్నీ ప్రస్తుతం ఆన్లైన్లో వినిపిస్తున్న లీకులు, అంచనాలు మాత్రమే. ఆపిల్ అధికారికంగా లాంచ్ తేదీ, ఫీచర్లు, ధరలను ప్రకటించే వరకు పూర్తి వివరాలపై క్లారిటీ రాదు.
