Arjun Sarja Daughter : అర్జున్ చిన్న కూతురు పెళ్లి ఫొటోలు వైరల్.. 14 ఏళ్ల ప్రేమకథకు శుభం కార్డు!
Arjun Sarja Daughter : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుటుంబానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఇద్దరు కుమార్తెల గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ సినిమాల్లోకి అడుగుపెట్టగా.. చిన్న కుమార్తె అంజనా అర్జున్ మాత్రం వ్యాపార రంగంలో తనదైన దారిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు అంజనా కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతంలోనే తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న ఆమె.. తాజాగా అక్టోబర్ 19న విదేశాల్లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



















